ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,మార్చి,23(ప్రజాన్యూస్);;నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆళ్లగడ్డ నియోజకవర్గం అపుస్మ సంఘం అధ్యక్షుడు టి. అమీర్ బాషా ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని బీసీ వసతి గృహంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమీర్ భాష మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో యువకులలో స్వాతంత్ర్య కాంక్ష రగిలించుటలో స్ఫూర్తిగా నిలిచారని వివరించారు.