ఖాసింవలి ప్రజాటివి ప్రతినిది
కర్నూలు, మార్చి 2(ప్రజాన్యూస్)
దూదేకుల సంక్షేమ సంఘ సమావేశంలో పలు కీలక అంశాలపై సమీక్ష..
కర్నూలు పట్టణంలోని గుడ్ షెఫర్డ్ పాఠశాలలో ఆదివారం దూదేకుల ఆత్మీయ సమ్మేళనాన్ని సంఘ నేతలు నిర్వహించారు. రాష్ట్ర దూదేకుల ఉద్యోగ సంక్షేమ సంఘం ( 84/24) అధ్యక్షులు సిద్దయ్య, జిల్లా అధ్యక్షులు మహబూబ్ బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. అలాగే పలు తీర్మానాలపై కూడా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కన్నయ్య , ఇమాంకాసిం, రిటైర్డ్ ఎంఆర్ఓ షేక్షావలి, రిసైడ్ డి ఎఫ్ ఓ ఖాదర్బాషా,కాశీం ,హాసన్, నబి రసూల్ , ఆర్మీ జమాల్, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.