ప్రజాటివి ప్రతినిది అక్షింతల శ్రీనివాసులు
ఆళ్లగడ్డ,పిబ్రవరి 12 (ప్రజాన్యూస్) ఆళ్లగడ్డ మండలం గూబగుండం గ్రామంలో బుధవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారవేట పల్లకికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. చింతకుంట గ్రామం నుండి గూబగుండం గ్రామానికి విచ్చేసిన శ్రీ స్వామివారి పారువేట పల్లకికి గ్రామ పెద్దలు , భక్తులు వేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. స్ధానిక మట్టా వారి వీధిలో సాయంత్రం పారువేట పల్లకికి ఉత్సవ తెలుపు దారులు పూజలు నిర్వహించారు.