బాబుగారు..బాసచేశారు..భరోసా ఇవ్వండి

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

నంద్యాల.పిబ్రవరి16(ప్రజాన్యూస్)

బాబుగారు..బాసచేశారు..భరోసా ఇవ్వండి అంటూ నంద్యాలజిల్లా నంద్యాల మండలం రైతునగరం,కానాల గ్రామరైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు,ఐటి మంత్రి నారాలోకేష్ ను వేడుకుంటున్నారు..వివరాలలోకి వెళితే జమ్మలమడుగు కల్వకుర్తి జాతీయ రహదారి 167 కె నంద్యాలనుండి రైతునగర్ కానాల మీదుగా నిర్మించేందుకు వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది..ఇందుకు గాను మూడు ఆష్షన్స్ అదికారులు తయారుచేశారు..అందులో ప్రస్తుతం నంద్యాలనుండి రైతునగరం మీదుగా కోవెలకుంట్ల వెళ్లే రహదారి ని కొద్డిగా వెడల్పుచేసి పాత రహదారినే ఖరారు చేయడం ..రెండవది ప్రస్తుతం నిర్ణయించిన బైపాస్ కొత్త రోడ్డు..అప్పటి ప్రజాప్రతినిదులు అదికారులు ఇచ్చిన మూడు ప్రతిపాదనలలో వారికి అనుగుణంగా ప్రస్తుతం భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మార్గాన్ని నిర్ణయించారు..ఈ మార్గం వెంబడి అప్పటి ఎంఎల్ఎ శిల్పా చక్రపాణిరెడ్డి 400 ఎకరాలకు పైగా వెంచర్ ఏర్పాటుచేశారు..ఈ వెంచరుకు పక్కగా రహదారి వెళ్లేలా ప్లాన్ ను సెట్ చేశారు..అలాగే ఈ రహదారిలోనే మరో ఇద్దరు వైసిపి నేతలు తమపొలాలు,వెంచర్లకు ప్రక్కనే రోడ్డు వెల్లేలా మార్గాన్ని రూపొందించారు..ఈ రహదారి ప్రపోజల్ చూస్తే పెద్దవారు అంతా కలిసి పేదోళ్ల పొలాల్లో రోడ్డు పోయేలా ప్లాన్ చేశారు..ఈ విషయాన్ని గమనించిన రైతునగరం,కానాల రైతులు అప్పటినుండి ఆందోళన చేస్తూనే ఉన్నారు..ఇప్పటికే ఈ రహదారి ఇటు కల్వకుర్తినుండి నంద్యాల వరకు, జమ్మలమడుగునుండి నంద్యాల వరకు 3డి పూర్తిచేసుకుంది..ఇక మిగిలింది నంద్యాల మండలంలోని కానాల, రైతునగరం ప్రాంతం మాత్రమే..రైతుల ఆందోళనతో దాదాపు 6నుంచి 7 కిమీ దూరం రోడ్డు మాత్రమే భూసేకరణకు నోచుకోలేదు..రైతుల ఆందోళన సమయంలోనే టిొడిపి జాతీయ ప్రదానకార్యదర్శి నేటి మంత్రి నారాలోకేష్ యువగళం పాదయాత్ర సందర్బంగా నంద్యాల రావడం విషయాన్ని రైతులు లోకేష్ దృస్టికి తీసుకుపోవడం జరిగింది..స్వయంగా ప్రతిపాదిత జాతీయ రహదారి పొలాలను పరిశీలించిన నారాలోకేష్ పేదరైతులను ఇబ్బందిపెట్టేలా అప్పటి వైసిపి ప్రజాప్రతినిదుల వెంచర్లకోసం రోడ్డును మరలించిన వైనంపై తీవ్రంగా స్పందించారు..తెలుగుదేశం ప్రభుత్వం అదికారంలోకి వస్తే రోడ్డును అందరికి అనుకూలంగా పేదలకు నష్టంలేకుండా చర్యలు తీసుకుంటామని అవసరమైతే మరో ప్రతిపాదన తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు..ఎన్నికల ప్రచారం సమయంలో నాటి ప్రతిపక్షనేత నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నంద్యాల ప్రచారానికి వచ్చిన సందర్బంగా రైతులు తమ సమస్యను చంద్రబాబుకు వివరించారు..ఎన్నికల ప్రచార సభలోనే చంద్రబాబునాయుడు 167 కె జాతీయ రహదారిని అప్పటి ఎంఎల్ఎ తన స్వార్ధంకోసం మలుపులు తిప్పారని తాము అదికారంలోకి వస్తే రైతులకు న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు..ఎన్నికలు అయిపోయాయి..టిడిపి అదికారంలోకి వచ్చింది..గత ఎనిమిది నెలలుగా రైతులు ప్రస్తుత ప్రభుత్వానికి 167 కె విషయంపై పిర్యాదులు ఇస్తూనే ఉన్నారు..కేంద్ర టిడిపి కార్యాలయంలో స్వయంగా ముఖ్యమంత్రి గ్రీవెన్స్ లో రైతులు పిర్యాదులు ఇచ్చారు..కాని పలితంలేదు..ఇటీవలే అదికారులు 200 మంది పోలీసులతో వచ్చి భూేసేకరన చేపట్టేందుకు సిద్ద పడ్డారు..అయితేమాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మానందరెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి అదికారులకు నచ్చ చెప్పిముఖ్యమంత్రిగారు రైతులకు మాట ఇచ్చారని త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చేంతవరకు భూసేకరణ ఆపాలని కోరారు..దీంతో అదికారులు వెనుదిరిగారు…గత ఏడాదిగా ఈప్రాంత రైతులు ఈరోడ్డు విషయంపై నిద్రా హారాలు లేకుండాపోరాటంచేస్తున్నా ,200 మంది పోలీసులు వచ్చి రైతులను భయబ్రాంతులను చేసినప్పటికి నంద్యాల ఎంఎల్ఎ మంత్రి ఎన్ ఎండి పరూఖ్ కనీసం రైతులను పరామర్శించడంగాని,రైతులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకు వెల్లి సమస్యనను పరిష్కరిస్తామని గా ని రాకపోవడం రోడ్డు విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంపై ఈప్రాంతరైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు..జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ప్రస్తుత ముఖ్యమంత్రి ఐటి మంత్రి హామీ ఇచ్చిన 167 కె రోడ్డువివాదంపై నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, వందలమంది పోలీసులతో భూసేకరణ ప్రక్రియకు అదికారులువస్తే రైతులు ఆందోళన చేసినప్పటికి  ఇద్దరు మంత్రులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆవేదన,ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు..గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసి న్యాయంచేస్తాం అంటే రైతునగరం కానాల గ్రామప్రజలు తెలుగుదేశంకు అత్యదిక ఓట్లు వేిసి మెజారిటీ చూపించారని అయినప్పటికి మంత్రి పరూఖ్ రైతులను పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..జాతీయ రహదారిని ఎవరూ ఆపలేరని చెబుతుున్నారని ఒక వేల అది సాద్యం కాకపోతే ప్రస్తుతం ప్రతిపాదించిన రహదారిలెో రైతులకు సంబందించిన 40 అడుగుల రోడ్డు ఉందని ఆ రోడ్డును జాతీయ రహదారి కొలతకు కలుపుకుని నిర్మాణం చేపడితే రైతులకు ప్రభుత్వానికి నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుందని రైతులక నష్టం కూడా చాలావరకు తగ్గుతుందన్న ప్రతిపాదనను కూడా అదికారులు గాని,ప్రజాప్రతినిదుులుగాని పట్టించుకోకపోవడంవిషయాన్ని ముఖ్యమంత్రి వద్దకు కూడా మంత్రులు పరూఖ్,బిసి జనార్దనరెడ్డి చేరవేయకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు..మాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మానందరెడ్డి నాటినుండి నేటి వరకు రైతుల ఆందోళన జరిగినప్పుడల్లా మద్దతు ఇస్తున్న వైనాన్ని వారు ఈ సందర్బంగా గుర్తుచేసుకుంటున్నారు..ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు మంత్రి నారలోకేష్ స్పందించి రైతులకు అపాయింట్  మెంటు ఇచ్చి రైతుల సమస్యను తీర్చాలని 167 కె జాతీయ రహదారి భాదిత రైతులు కోరుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *