ప్రజాటివి ప్రతినిది నారెళ్ల చిరంజీవి
పిట్ నెస్ సర్టిపికెట్ల మంజూరు నిలిపివేసిన అదికారులు
ప్రయివేటు ఏజన్సీలవద్ద చేయించుకోవాలని సూచన
స్లాట్ ఎందుకు బుక్ చేసుకున్నారని దరఖాస్తుదారుల ఆగ్రహం
మాడబ్బు తిరిగి ఇవ్వకుండా పిటినెస్ ఇవ్వకుండా ఉంటే ఎలా అంటూ ఆందోళనః
వివరణ ఇచ్చిన రవాణా శాఖాదికారి ఐశ్వర్యారెడ్డి
ఉన్నతాదికారులకు విషయం వివరించిన ఆర్టిఓ
నంద్యాల.జనవరి 27(ప్రజాన్యూస్) నంద్యాల జిల్లా రవాణాశాఖా కార్యాలయం వద్ద పిటెనెస్ దరఖాస్తుదారులు ఆందోళన నిర్వహించారు..వివరాలలోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం రాస్ట్రంలోని నంద్యాలతోపాటుగా నాలుగు ప్రాంతాలలో పిటినెస్ తనిఖీ ప్రయివేటు ఏజన్సీలకు అప్పచెప్పింది…ఈనెల 25 నుంచే నంద్యాల జిల్లా పరిదిలోని పిటెనెస్ దరఖాస్తుదారులు ప్రయివేటు ఏజన్సీలవద్దే పిటెనెస్ సర్జిపికెట్లు తీసుకోవాలి ..అయితే రవాణా శాఖ రాస్ట్రస్థాయి అదికారులు నిర్లక్ష్యంతో పిటెనెస్ చేసుకునేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పిబ్రవరి నెలవరకు తీసుకున్నారు..స్లాట్ బుక్ చేసుకున్న వారు నేడు రవాణా శాఖ కార్యాలయం వద్దకు వస్తే పిటెనెస్ ప్రయివేటు ఏజన్సీల వద్ద చేయించుకోవాలని చెప్పడంతో దరఖాస్తుదారులు అవాక్కయ్యారు..తాము చెల్లించిన డబ్బు పరిిస్తితి ఏంటని ప్రశ్నించారు..తాము ఏమిచేయలేమని పైనుంచి ఆర్డర్లు వచ్చాయని చెప్పడంతో దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తంచేుస్తూ దర్నాకు దిగారు..ఆర్టిఓ బయటకు వచ్చి సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు..ఎట్టకేలకు ఆర్డిఓ ఐశ్వర్యారెడ్డి బయటకు వచ్చి దరఖాస్తుదారులకు వివరణ ఇచ్చారు..పిటినెస్ ఇవ్వడానికి తమకు ఇప్పుడు సైట్ కూడా ఓపెన్ లేదని పై అదికారులకు విషయం తెలియపరిచి దరఖాస్తుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..కొద్ది సేపు శాంతించిన దరఖాస్తుదారులు తిరిగి ఆందోళన మొదలు పెట్టారు..ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఆందోళనకు దిగారు..ఇది ఇలా ఉండగా రాష్ట్ర అదికారులు నిద్రావస్తలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్థానిక అదికారులు దరఖాస్తు దారులు ఇబ్బందులు పడుతున్నారు..పిటెనెస్ సర్టిపికెట్లు ప్రయివేటు ఏజన్సీలకు అప్పగించిన వెంటనే ఒక డేట్ పిక్స్ చేసి సైట్ ఆప్ లో ఉంచినట్లయితే దరఖాస్తు దారులు స్లాట్ బుక్ చేసుకునే వారు కాదు…లేదా స్లాట్ బుక్ అయినంతవరకు అదికారులే పిటెనెస్ సర్టిపికెట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్తితి ఉండేదికాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాదికారుల నిర్లక్ష్యంతో కోట్లాదిరూపాయలు పిట్ నెస స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు నష్టపోవడమే కాక వారు ఆపీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చారు..ఇప్పటికైనా స్లాట్ బుక్ చేసుకున్న వారివరకు పిటెనెస్ సర్టిపికెట్లు మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..