♦ ప్రజాటివిప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సమావేశం అయ్యారు.

బుధవారం సాయంత్రం మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ కార్యాలయంకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వచ్చి మంత్రి పరూఖ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం మంత్రి, ఎంపీ లు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అధిక నిధులు మంజూరుకు కృషి చేద్దాం అన్నారు. ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజల సమస్యలకు పరిస్కారం చూపుదాం అన్నారు.