♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
⇔శివ స్వాముల సేవ మహాభాగ్యం.
⇔500 మందికి అన్నదానం.
⇔అన్నం వడ్డించి…విస్తారాకులు తీసి.
మహా శివరాత్రి పండుగ ను పురస్కరించుకొని శివ స్వాములకు అన్నదానం చేయడం పూర్వ జన్మ సుకృతం అని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు పేర్కొన్నారు.నంద్యాల పట్టణం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివ స్వాములకు గుండాల మధుసూధన్ రావు ( అభిరుచి మదు) సతీమణి మాధవీ లత,కుమారులు మనీష్ చౌదరి,శ్రీకర్ చౌదరి,తల్లి శేషమ్మ ల అధ్వర్యంలో 500 మంది శివ స్వాములకు అన్నదానం చేశారు. స్వాములకు స్వయంగా వడ్డించి,బిక్ష తీసుకున్న స్వాముల విస్తరలను స్వయంగా తీసి,గంపలో మోసి బయటవేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ నందులకు నిలయమైన నంద్యాల లో ఉన్నవారందరూ అదృష్టవంతులు అన్నారు.నంద్యాల చుట్టూ శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.ప్రధానంగా శ్రీశైలం,మహానంది పుణ్య క్షేత్రాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.మహా శివరాత్రి పండుగ కు కర్ణాటక,తమిళనాడు కు చెందిన భక్తులు అనేక మంది నడుచుకుంటూ వస్తారని అన్నారు.కాళ్ళకు బొబ్బలు ఎక్కుతున్నా,సంచిపట్టలు కట్టుకొని కాలినడకన స్వామివారిని దర్శించుకుంటారని ,అలాంటి శివ భక్తులకు అన్నదానం చేయడం పూర్వ జన్మ సుకృతం అన్నారు.శివ స్వాముల సేవ చేసుకునే భాగ్యం లభించడం ఆనందంగా ఉందని అన్నారు.