♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
⇔వైసిపి ప్రభుత్వంలో అవినీతి శ్వాసగా మారిపోయింది.
⇔సెంటు స్థలం ఎక్కడిస్తున్నరో గమనించండి.
నంద్యాల నియోజకవర్గంలో శిల్పా కుటుంబ ఆగడాలను అడ్డుకోవాలంటే బిజెపికి పట్టం కట్టాలని నంద్యాల అసెంబ్లీ బిజెపి కన్వీనర్ అభిరుచి మదు ప్రజలను కోరారు..బిజెపి చేపట్టిన పోరు యాత్రలో భాగంగా పొన్నాపురం,హౌసింగ్ బోర్డు కాలనీ,ఎన్జీఓ కాలనీ,వి మార్ట్,ప్రభుత్వ ఆసుపత్రి,నూనె పల్లె ప్రాంతాల్లో యాత్రను నిర్వహించారు.ప్రజలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలవర్షం కురిపిస్తూ,గజమాలలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో పేద ప్రజల కోసం టిట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ శాడిస్టు మనసత్వంతో పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు.పేదలందరికీ సెంటు స్థలం ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే వైసిపి ప్రభుత్వం ఆ స్థలాలు ఎక్కడ ఇస్తున్నారో అందరికీ తెలుసన్నారు.ఎకరా 4 ,5 లక్షలకు కొనుగోలు చేసి 40,50 లక్షలకు కొనుగోలు చేసినట్లు పెట్టిన బిల్లులు దొంగ బిల్లులుగా ఆధారాలతో నిరూపణ అయిందని అన్నారు.వైసిపి ప్రభుత్వంలో అవినీతే శ్వాసగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా జగన్ లో మార్పు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవడానికి బిజెపి రంగంలో దిగిందని అన్నారు. ఏపి అంటేనే అవినీతి మయం,నేరాలు,ఘోరాలు,భూ ఖబ్జాలు,హత్యలు,జైళ్లు, బెయిల్ లు,కూల గొట్టడాలు,తుగ్లక్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.నిరంకుశ ప్రభుత్వం నుంచి ప్రజలను ఆదుకునేందుకు బిజెపి ప్రజా పోరు యాత్ర ను బుజాన వేసుకుందని పేర్కొన్నారు.యువత ఉద్యోగాలు లేక వలసపోతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.రైతులకు సాగు నీరు లేదు,ప్రజలకు త్రాగు నీరు లేదన్నారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదప్రజల కోసం టిట్కో గృహాలు పూర్తయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాడిస్టు మనసత్వం తో పంపిణీ చేయడం లేదన్నారు..ఈ కార్యక్రమంలో నాగభూషణం,కిరణ్,శ్రీ రాములు,శ్రీకాంత్,శంకరయ్య,బాబు,రమేష్,పెద్ద నాగయ్య,కసెట్టీ చంద్రశేఖర్,నిమ్మకాయల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.