♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
⇔వైఎస్సార్ రైతు భరోసా- పిఎం కీసాన్ క్రింద అర్హులైన రైతన్నలకు 2,34,151 మందికి రూ.47.06 కోట్లు జమ*
⇔వైయస్ఆర్ సున్న వడ్డీ పంట రుణాలు రబీ 2021-22 మరియు ఖరీఫ్ 2022 అర్హులైన 25,029 మంది రైతన్నలకు 11.08 కోట్ల రూపాయల జమ*
⇔జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహూల్ కుమార్ రెడ్డి*
రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అన్ని రకాల స్కీములు అందుబాటులోకి తీసుకువస్తూ జిల్లాలో ఇప్పటివరకు 1426 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి రైతులకు చేకూర్చిందని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టరు రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు..ముఖ్యమంత్రి కార్యాలయంనుండి ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిదుల విడుదల అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా- పిఎం కీసాన్ కింద రైతులకు వరుసగా ఐదవ ఏడాది మూడవ విడతగా జిల్లాలో అర్హులైన 2,34,151 మందికి రూ.47.06 కోట్ల రూపాయల లబ్ది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. అలాగే వైఎస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమంలో భాగంగా రబీ 2021-22, ఖరీఫ్ 2022 లో రుణాలు పొంది సకాలంలో చెల్లించిన అర్హులైన 25,029 మంది రైతన్నలకు 11.08 కోట్లు జమ చేశామన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి 48,990 మంది రైతులకు రూ.20.36 కోట్లు, బనగానపల్లె నియోజకవర్గానికి సంబంధించి 49,145 మంది రైతులకు రూ.15.03 కోట్లు, డోన్ నియోజకవర్గానికి సంబందించి 37,337 మందికి రూ.8.28కోట్లు, నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి 42,300 మందికి రూ.12.37కోట్లు, నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి 16,121 మందికి రూ.6.02కోట్లు, పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 15,649 మంది రైతులకు రూ.5.04కోట్లు, శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి 29,053 మంది రైతుల ఖాతాల్లోకి రూ.8.52కోట్లు వెరసి మొత్తం 2,34,151 మంది రైతులకు రూ.47.06 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి అండగా నిలిచిందని జేసీ వివరించారు.*
ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతులకు పెద్ద ఎత్తున రైతు భరోసా ఆర్థిక లబ్దిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేకూరుస్తున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైయస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నామన్నారు.*అనంతరం రైతు సోదరులకు రైతు భరోసా, వైయస్ ఆర్ సున్న వడ్డీ పంట రుణాల చెక్కును అందజేశారు.*