♦ప్రజాటివి ప్రతినిదిప్రభాకర్ చౌదరి
*ఖరీఫ్ పంట రుణాలను రీ షెడ్యూల్ చేయండి*
*పాడి, పరిశ్రమ రంగాలకు లaక్ష్యం మేరకు రుణాలందించండి*
*బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు*
కౌలు రైతులకు పెద్ద ఎత్తున రుణాలుఇవ్వడంతో పాటు వ్యవసాయం, పాడి, పరిశ్రమ ఇతర ఉపాధి రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ ,రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు బ్యాంకర్లకుసూచించారు.*
గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా బ్యాంకర్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ కె. నరసింహారావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డిఓ నాగ ప్రవీణ్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ టీవీ రమణ, ఎస్బిఐ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, వ్యవసాయ, పాడి పరిశ్రమ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.*
*ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో సి.సి కార్డులు మంజూరు చేసిన 22,740 మంది కౌలు రైతులకు విరివిరిగా రుణాలు అందించాలని బ్యాంకర్లను సూచించారు. కరువు మండలాలుగా ప్రకటించిన పాణ్యం, బనగానపల్లి, గడివేముల, మిడుతూరు, పగిడ్యాల, బేతంచర్ల మండలాల్లో ఖరీఫ్ లో తీసుకున్న పంట రుణాలను రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు రీ షెడ్యూల్ చేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులతో పాటు పాడి పరిశ్రమ, ఇతర అన్ని ప్రాధాన్యతా రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించి ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను, అధికారులను ఆదేశించారు. జగనన్న బడుగు వికాసం కింద చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల యూనిట్లకు రుణాలందించి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఉపాధి కల్పనకు తోడ్పాటును అందించాలన్నారు. పీఎంఈజీపి, హౌసింగ్, స్టాండ్ ఆఫ్ ఇండియా, ముద్ర స్కీము రుణాలకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి అర్హులయిన వారందరికీ రుణాలను అందించడంలో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు.
నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అన్ని వనరులు వున్న నంద్యాల ప్రాంతంలో పాడి పరిశ్రమాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతుల్లో అవగాహన కల్పించడంతోపాటు సబ్సిడీ లింక్డ్ రుణాల అందించేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. చెంచుగూడెంలలోని ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత కల్పించడంతో పాటు వారి గూడెంలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలని బ్యాంకర్లను యంపీ సూచించారు.*
అంతకుముందు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో డిసెంబర్ 31 నాటికి 93 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. ఈ రుణ ప్రణాళికలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక ఇతర ఉపాధి రంగాలకు మంజూరు చేసిన రుణ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, అన్ని సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.*