ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
ఉమ్మడి కర్నూలుజిల్లాలో ఈనాడు కార్యాలయంపై దాడి, ఆంద్రజ్యోతి విలేకరిపై దాడులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పత్రికా విలేకరులపై దాడులను వినూత్నంగాఖండించింది అఖిలభారత ఉమ్మడిజిల్లా న్యాయవాదులసంఘం..ఈమేరకు నంద్యాలజల్లా ఆళ్లగడ్లలో సీనియర్ జర్నలిస్టులకుసన్మానం నిర్వహించి దాడులను తీవ్రంగా సంఘనేతలు ఖండించారు.
రాష్ట్రం లో పత్రికా విలేఖరుల పైన మరియు పత్రికా కార్యాలయాల పైన జరిగిన దాడులను అఖిల భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు న్యాయవాది యస్ రమణయ్య ,ఆళ్లగడ్డ advocates association కార్యదర్శి సీనియర్ న్యాయవాది బి. శివ ప్రసాదరావులు తీవ్రంగా ఖండించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సీనియర్ న్యాయవాది శివ్రసాదరావు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సీనియర్ న్యాయవాదులు రమణయ్య, శివ ప్రసాదరావు లు మాట్లాడుతూ రాష్ట్రం లో పత్రికా విలేఖరుల పైన మరియు పత్రికా కార్యాలయాల పైన జరిగిన దాడులను న్యాయవాదులు గా తాము తీవ్రంగా ఖండిస్తున్నమని తెలిపారు.
పత్రికా రంగం పైన దాడులు జరగడం అనేది ఆరోగ్యకరమైన మానవ సమాజానికి మంచిది కాదని,అన్ని వర్గాలవారు సమిష్టిగా ఖండించ వలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనైతికమైన దాడులు ఫోర్త్ ఎస్టేట్ అఫ్ ది స్టేట్ అయిన పత్రికా రంగానికి మూల స్తంభాలైన పాత్రికేయ మిత్రులపైన బాధ్యత రాహిత్యంగా దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పెరొన్నరు. రాప్తాడులో జరిగిన వార్తా సేకరణలో ఉన్న ఆంధ్ర జ్యోతి పత్రికా విలేఖరులు పైన విచక్షణా రహితంగా దాడి చేయడం చట్టవిరుద్ధమని, నిన్నటి దినం కర్నూలు లో ఈనాడు పత్రికా కార్యాలయం పైన పాత్రికేయులపైన సిబ్బంది పైన దౌర్జన్యంగా దాడి చేయడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు . ప్రజలకు వాస్తవాలను చేర్చడానికి ప్రాణాలను సైతం తెగించి వార్తలు సేకరించి ఎప్పటికప్పుడు త్వరిత గతిన అందించే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న పాత్రికేయులపై ఈ విధమైన చట్ట విరుద్ధమైన అనైతిక దాడులు జరగడం సమాజానికి ఆరోగ్యకరం కాదన్నారు.
పాత్రికేయుల వార్తా సేకరణలో పొరపాటు ఉంటే అందుకు తగిన విధంగా చట్ట పరంగా స్పందించాలి గాని ఈ విధమైన దౌర్జన్యకర దాడులు అనేది ప్రభుత్వం యొక్క నిస్సహాయతకు అడ్డం పడుతుందన్నారు. సమాజంలో భయపెట్టి అందరిని తమ వైపుకు తిప్పుకోవాలనే నియంత్రత్వ పోకడలను ఈ విధమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.భాద్యులైన వారిపై చట్టపరంగా చర్యలుతీసుకోకపోతే అఖిలభారత న్యాయవాదులసంఘం పాత్రికేయమిత్రులతో కలిసి ఆందోళన తీవ్రతరంచేస్తామన్నారు..అనంతరం దాడులకు నిరసనగా వినూత్నంగా సీనియర్ పాత్రికేయులు అయిన సుబ్బారావు, మోహన్ రెడ్డి, నాగరాజు, రఫీ లను శాలువా కప్పి న్యాయవాదులు సన్మానం చేశారు.. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుబ్బయ్య, శ్రీనివాసులు, సుదర్శన్ , నరసయ్య, చందన, లత, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.