గోస్పాడు మండలంలో రూ..5.15 కోట్ల అభివృద్ది పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి

♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని తేళ్లపురి, రాయపాడు గ్రామాల్లో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మండలంలోని తేళ్లపురి గ్రామం నుండి నంద్యాల బొమ్మల సత్రం వరకు బీటీ రోడ్డును ప్రారంభించారు. అలాగే తెళ్లపురి గ్రామంలో అసైన్డ్ భూములను రిజిస్టర్ పట్టాలుగా 93 మందికి 84.42 ఎకరాలు భూమిని పంపిణీ చేపట్టారు. రాయపాడు గ్రామంలో గత ఎన్నో సంవత్సరాల నుండి అపరిస్కృతంగా ఉన్న మంచినీటి సమస్య నివారణకు 40 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన పంప్ హౌస్ పైప్ లైన్  నుండి నీటిని విడుదల  చేశారు. . ప్రారంభ కార్యక్రమాలలో ఎమ్మెల్యే తో పాటు రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి , వైఎస్ఆర్సిపి నాయకులు ప్రహల్లాద రెడ్డి. ఎంపీపీ ఆర్థర్ సైమన్, సర్పంచ్ రామేశ్వరమ్మ ,పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గోస్పాడు మండలంలోని తేళ్లపురి గ్రామం నుండి నంద్యాల బొమ్మల సత్రం వరకు ఉన్న రోడ్డును నూతనంగా 4 కోట్ల 75 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారు. రాయపాడు గ్రామంలో గత ఎన్నో సంవత్సరముల నుండి త్రాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను పరిష్కరించేందుకు 2 కిలోమీటర్ల నుండి నీటిని పైప్ లైన్ ల ద్వారా తీసుకువచ్చి గ్రామ ప్రజల యొక్క దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించడం జరిగిందన్నారు. అదేవిధంగా తెళ్లపురి, కూలూరు గ్రామాల్లో త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారని, ఆ సమస్యను త్వరలో పరిష్కరించేందుకు ప్రభుత్వానికి కోటి 20 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను పంపించామని తెలిపారు. త్వరలో నిధులు మంజూరు చేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు భవిష్యత్తులో నంద్యాల గోస్పాడు మండల పరిధిలోని ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వైసిపి నాయకులు రామసుబ్బారెడ్డి, పెద్ద వెంకటసుబ్బారెడ్డి, నమాల వెంకటేశ్వర్లు, గాండ్ల విజయభాస్కర్ రెడ్డి, గాండ్ల రాజశేఖర్ ,బాణ వెంకటసుబ్బారెడ్డి ,తేలపురి వైసిపి నాయకులు నారాయణ, అనిదెలా లోకేష్ ,అన్నయ్య, అనిదల ప్రసాద్, సుధాకర్, కులూరు ప్రసాద్, మరియు రెవిన్యూ అధికారులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *