ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్ పై దాడికి నిరసనగారాష్ట్ర వ్యాప్తంగాపెల్లుబికిన నిరసనలు..

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

⇔రాష్ట్ర వ్యాప్తంగాపెల్లుబికిన నిరసనలు

⇔దాడికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్

⇔ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో జర్నలిస్ట్ జాయింట్ ఆక్షన్ కమిటీ కలెక్టరెట్ ఎదుట నిరసన.

అనంతపురం జిల్లా రాప్తాడు వైసిపి బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడి చేయడాన్ని నిరసిస్తూ  రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు..  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో నిర్వహించిన సభకు విధి నిర్వహణలో భాగంగా వెళ్లి ఫోటోలు తీస్తున్న కృష్ణ పై కొందరు కొందరు వైసీపీ అల్లరి మూకలు దాడి చేయడం హేయమని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ముఖ్తకంఠంతో ఖండించారు..ఈమేరకు ఆంద్రప్రదేశ్ లోని జర్నలిస్టు సంఘాలు ఎపియుడబ్య్లుజె,ఎపిజెఎప్,తోపాటుగా పలు జర్నలిస్టు సంఘాలు ఆందోళన నిర్వహించారు..పోటోగ్రాపర్ పై దాడికిపాల్పడ్డ దుండగులపై కేసులు నమోదుచేసి తక్షణమే అరెస్టు చేయాలని ఈసందర్బంగా జర్నలిస్టులు డిమాండ్ చేశారు..మీడియా హౌజ్ లను పొలిటకల్ లీడర్లే నిర్వహిస్తూ మీడియా కార్పొరేట్ చేతికి వెళితే అందులో పనిచేస్తున్న పాత్రికేయులను భాద్యులు చేస్తూ వారిపై దాడులు చేయడం సమంజసం కాదని వారు హెచ్చరించారు…రాష్ట్రముఖ్యమంత్రిగా ఒక మీడియా హౌజ్ నిర్వహిస్తున్న వ్యక్తిగా జగన్ మోహనరెడ్డి ఇలాంటి దుర్మార్గ చర్యలను ప్రోత్సహిస్తే జర్నలిస్టులంతా రాబోయే ఎన్నికలలో తగిన బుద్దిచెబుతామని వారు హెచ్చరించారు..ఇలాంటి ఘటనలను అన్ని మీడియా సంస్థలలో పనిచేసే జర్నలిస్టులు ఐక్యమత్యంగా ఖండించాలని ,ఇప్పుడు ఆంద్రజ్యోతి విలేకరిపై దాడిచేస్తే రేపు సాక్షి మీడియాపై వారికి వ్యతిరేకులు దాడిొచేసుకుంటా పోతే నష్టపోయేది జర్నలిస్టు కుటుంబమే కావును జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలనిన జర్నలిస్టుసంఘనేతలు కోరుతున్నారు…

⇔ఉమ్మడి కర్నూలుజిల్లాలో

♦♦

అనంతపురం జిల్లా రాప్తాడు లో వైసిపి నిర్వహించిన సిద్దం సభలో ఆంద్రజ్యోతిపోటోగ్రాపర్ కృష్ణపై వైసిపి ముూక మూకుమ్మడి దాడిని ఉమ్మడి కర్నూలు జిల్లా జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటి తీవ్రంగా ఖండించింది. . దాడికి పాల్పడిన వైసీపీ మూకాలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్లి ఫోటోలు తీస్తున్న కృష్ణ పై కొందరు కొందరు వైసీపీ అల్లరి మూకలు దాడి చేయడంను జేఏసీ ఆధ్వర్యంలో ఖండించారు. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ టీజీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, సాయికుమార్ నాయుడు, రాష్ట్ర నాయకులు, ఆంధ్రప్రభ ఎడిషన్ ఇంచార్జి యనమల మద్దిలేటి, సీనియర్ జర్నలిస్ట్, ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ చంద్రయ్య, వరప్రసాద్, మంజునాథ్ యాదవ్ , విజయ్, ఇస్మాయిల్, మధు, రాజు, రవికుమార్, ఆసిఫ్, వలి, రాఘవేంద్ర, రామకృష్ణ, హుస్సేన్, సురేష్, చెన్నయ్య, ఖలీల్, శ్రీనివాసులు, పరమేష్ , సలాం భాష తదితరులు పాల్గొన్నారు.

⇔నంద్యాలలో

అనంతపురం జిల్లా రాప్తాడులో వైసిపి నిర్వహించిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్ కృష్ణపై వైసిపి మూకచేసిన మూకదాడిని ఆంద్రప్రదేశ్ జర్నలిస్టు పోరం రాష్ట్ర ఆర్గనైైజింగ్ సెక్రటరీ ప్రభాకర్ చౌదరి, ఎపియుడబ్య్లుజె నేతలు చలంబాబు,మధుబాబు లు తీవ్రంగా ఖండిాంచారు..సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఒక ప్రదాన మీడియా హస్ కి అదిపతిగా ఉన్న జగన్ మోహనరెడ్డి సభలో ఇలాంటి సంఘటనలు జరగడం హేయమన్నారు..కృష్ణపై దాడికిపాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు..కాగా కృష్ణ పై దాడికి నిరసగనా ఎబిన్ ఆంద్రజ్యోతి నిర్వహించిన ఆందోళనలో పలు ప్రజా సంఘాలు జర్నలిస్టులు పాల్గొని పోటో జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *