ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల పట్టణం లో SBI కాలనీ లోని సర్వే నెంబర్ 2313/1C లో కబ్జాకు గురైన 2 ఎకరాల 60 సెంట్ల మునిసిపల్ స్థలాన్ని కాపాడాలని నంద్యాల మాజీ ఎంఎల్ ఎ భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు..ఈమేరకు ఆయన నంద్యాల మునిసిపల్ కమీషనర్ ను కలిసి వినతి పత్రం అందచేశారు..
అనంతరం భూమా మీడియా తో మాట్లాడుతూSBI కాలనీ లో కోట్లు విలువ చేసే మునిసిపల్ స్థలం కబ్జాకు గురైన విషయం ప్రింట్ అండ్ మీడియా లోప్రముఖంగా రిపోర్టు అయినకుడా మునిసిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని,కబ్జాదారులు కోర్టుకు ఏలాంటి డాక్యుమెంటులు సబ్మిట్ చేసారో కూడా ఇంకా బయటికి రాలేదన్నారు.. మునిసిపాలిటీ స్థలం అని తెలిసినా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ లు ఎలా జరుగుతున్నాయని వీటిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్ ని కోరడం జరిగిందన్నారు.
భూమా తో పాటు నంద్యాల టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖాలీల్ అహ్మద్, NMC ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ మాబు వలి, కౌన్సిలర్ నాగార్జున, నంద్యాల మైనారిటీ కార్యదర్శి మస్తాన్ బాబా, రాష్ట్ర SC సెల్ మద్దికెర కైలాష్, గోస్పాడు మండల కన్వీనర్ చంద్ర శేఖర్ రెడ్డి, పట్టణ వైస్ ప్రెసిడెంట్ ఆయుబ్ బాషా, రాంపల్లె రామిరెడ్డి, తోట రామయ్య, మంజుల వెంకట స్వామి, శ్రీనివాసులు(బుజ్జి), వారీష్, జయప్రకాష్, మహిళ కార్యదర్శి గుర్రం లక్ష్మీ, షైక్ షబీర్, మాబు హుస్సేన్, ITDP నాగార్జున రెడ్డి, బాబా ఫాక్రుద్దీన్, గుల్లి బాషా, బాల మద్దిలేటి, పీవీ నగర్ మధు, నరసింహుడు, అలీ, చిలకల సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.