ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ మెంబర్ పదవికి సిద్ధం శివరాం వన్నెతీసుకురావాలని నంద్యాల శాసన సభ్యులు శిల్పారవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం శివరాంను ఏపీపీఎస్సీ మెంబర్గా ఎంపిక చేయడం జరిగింది. ఈ మేరకు స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నందు సిద్ధం శివరాంకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరగింది. కార్యక్రమానికి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.రవికృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, వైఎస్సార్సీపీ నాయకులు, బలిజ సంఘం ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాలలోని ప్రముఖులు, అభిమానులు, బందుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు హాజరై సిద్ధం శివరాంను ఘనంగా సన్మానించారు. ముందుగా సన్మానగ్రహీత శివరాంను, ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డిని వేదపండితులు సన్మానించి ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నంద్యాల నియోజకవర్గం నుండి ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యునిగా సిద్ధం శివరాం ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి అందించిన ఈ అత్యున్నత పదవికి వన్నెతీసుకురావాలని కోరారు. ఇదే నంద్యాల నుండి గతంలో డా. నౌమాన్ ఒకసారి సభ్యుడిగా, అనంతరం చైర్మన్ గా పదవీబాధ్యతలను చేపట్టారని, నేడు మరోసారి నంద్యాలకు సిద్ధం శివరాంకు అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలను తీర్చేందుకు సిద్ధం శివారం కృషిచేయాలని పదవికి వన్నెతీసుకురావాలని కోరారు
ఎంపీ మాట్లాడుతూ… సిద్ధం శివరాంకు ఏపీపీఎస్సీ మెంబెర్గా అవకాశం రావడానికి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి చేసిన కృషి అభినందనీయం అన్నారు. నిరుద్యోగుల సమస్యలను తీర్చేందుకు సిద్ధం శివారం కృషిచేయాలని పదవికి వన్నెతీసుకురావాలని కోరారు.
ఎమ్మెల్సీ ఇసాక్ బాష మాట్లాడుతూ…వివాధరహితుడు, అకుంటిత ధీక్షాపరుడు, మంచి వ్యక్తిగా ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన సిద్ధం శివారం ఏపీపీఎస్సీ సభ్యునిగా ఎంపిక కావడం అభినందనీయం అన్నారు. బాధ్యతాయుతమైన పదవికి వన్నెతీసుకురావాలని కోరారు. శిల్పాకుటుంబాన్ని నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని చెప్పెందుకు తాను, సిద్ధం శివారం ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పీపీ మధుసూధన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ విజయశేఖరరెడ్డి, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, గోస్పాడు ఎంపీపీ సైమన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కైపారాముడు, రాష్ట్ర కాపు జేఏసీ ప్రతినిధి బాలీశ్వరయ్య, కాపు సంఘం నాయకులు వర్ధంశెట్టి రాజారాం, రెడ్డి సంఘం అధ్యక్షుడు ఆర్వీ సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నాగన్న, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, డా. రాకేష్ రెడ్డి, నెరవాటి సత్యనారాయణ, కాపు సంఘం నాయకులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, శంకరయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.