ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
రాష్ట్రంలో ఎన్నికల వేడి కాకపుట్టిస్తోంది..ప్రధాన పార్టీలలో అసమ్మతి సెగ ఇరుపార్టీల సొంతగూట్లో కుంపట్లు రాజేస్తోంది…జిల్లా కేంద్రమైన నంద్యాలలో ప్రదానపార్టీలైన వైసిపి తెలుగుదేశం పార్టీలలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. తెలుగుదేశం పార్టీకి గత నాలుగు ఏళ్లుగా ఇంచార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డి వ్యవహరిస్తూ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి టికెట్టు ఆశించారు..నాలుగేళ్లుగా ప్రజల్లో ఉంటూ తనకంటూ ఓ ఇమేజిని బిల్డప్ చేసుకున్నారు..అనూహ్య పరిణామాలతో ఇటీవల టిడిపి పార్టీలో సీనియర్ లీడర్ గా కొనసాగుతూ అనేక పదవులు చేపట్టిన మాజీ మంత్రి పరూఖ్ ను టిడిపి అదిష్టానం ఇంచార్జిగా నియమించింది..ఈ నేపద్యంలో మరో రెండు నెలలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో సైతం అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్ ఎండి పరూఖ్ టిడిపినుంచి పోటీగా సిద్దమయ్యారు..అయితే ఇప్పటికి అధిష్టానం అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించకపోవడంతో ఇరువర్గాలు తమకే టికెట్టు అంటూ విడివిడిగా ప్రచారం చేసుకుంటున్నారు..పార్టీ కార్యక్రమాలు ప్రచారాలు ఇరువురు విడివిడిగా చేసుకుంటున్నారు..ఈపరిణామం ఎటు దారితీస్తుందోనని టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇక వైసిపి విషయానికి వస్తే మాజీ మంత్రి శిల్పామోహనరెడ్డి తనయుడు శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రస్తుతం ఎంఎల్ గా కొనసాగుతున్నారు..ఇటీవల నంద్యాల వైసిపిలో సైతం వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి..ప్రారంభంలోనే వైసిపి సీనియర్ నాయకులు మల్కిరెడ్డి శిల్పాకుటుంబానికి దూరంగా ఉంటున్నారు..శిల్పా,మల్కిరెడ్డి వర్గాల మద్య కేబుల్ వార్ వీరి మద్య మరింత దూరాన్ని పెంచింది..ఇటీవలే శిల్పాకుటుంబాన్ని వారి పాలనను విభేదించి ఆవర్గంలో కీలకనేతగా కొనసాగిన ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి వైసిపినుండి బయటకు వచ్చి టిడిపి తీర్దం పుచ్చుకుని టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు..తాజాగా లోకల్ నాన్ లోకల్ అంటూ వ్యవహారం తెరపైకి తెచ్చారు వైసిపి నేత ప్రస్తుత జడ్ పిటిసి గోకుల కృష్ణారెడ్డి..శిల్పాకుటుంబాన్ని తీవ్రంగా విభేదిస్తూ వైసిపి టికెట్టు తనకే వస్తుందని గట్టినమ్మకంతో ఉన్నారు..ఈమేరకు వేరు కుంపటి పెట్టి వైసిపి కార్యాలయం కూడా ఆయన ప్రారంభించారు..శిల్పా వ్యాఖ్యలపై ప్రతిరోజూ ఆందోళనలు నిర్వహిస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు గోకుల కృష్ణారెడ్డి..వైసిపి టికెట్టు ఇస్తే ఇచ్చినట్లు లేకుంటే తన మేనమామ గంగుల ప్రతాపరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీతీర్థంపుచ్చుకునేందుకు పావులుకదుపుతున్నట్లు సమాచారం..ఇప్పటికే గోకుల కృష్ణరెడ్డి ,గంగుల ప్రతాపరెడ్డి తో పిసిపి చీప్ షర్మిల టచ్ లో ఉన్నట్లు సమాచారం..ఏ పార్టీ టికెట్ ఇచ్చినా నంద్యాలనుండి ఎంపిగా లేదా ఎంఎల్ఎగాపోటీచేస్తానని గతంలోనే ప్రకటించిన సీనియర్ నేత గంగుల ప్రతాపరెడ్డి ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీనుండి ఎంపిగా,తనమేనల్లుడు గోకుల కృష్ణారెడ్డి అసెంబ్లీకి పోటేచేసేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం…
ఇదిలా ఉంటే నంద్యాల నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ సైతం పుంజుకుంటోంది..ఈపార్టీ తెలుగుదేశంతో పొత్తు ఉన్నా లేకున్నా తాను బిజెపి అభ్యర్ధిగా పోటీచేస్తానని ఆపార్టీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు ఇప్పటికే ప్రకటించారు..
ఈమేరకు ఆయన నియోజకవర్గంలో తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు..దీంతో రాబోయే ఎన్నికలలో నాలుగు ప్రధానపార్టీలు హోరా హోరీగా తలపడే అవకాశం ఉండటంతో నంద్యాల నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఎవరికి నష్టంచేస్తుందో ఎవరికి లాభంచేకూరుస్తుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు..