ప్రజాటివిప్రతినిది ప్రభాకర్ చౌదరి
అహోబిళం..నవనరసింహక్షేత్రాలు..వరాహనరసింహస్వామి
నంద్యాలజిల్లా లోని ప్రముఖ ఆద్యాత్మిక క్షేత్రాలలోొ ఒకటి అహోబిలం..అహోబిలంలో కొలువైన నవనారసింహక్షేత్రాలు ప్రసిద్ది పొందాయి..అందులో వరాహనరసింహస్వామి రెండవ క్షేత్రం..ఈక్షేత్రం ఎగువ అహోబిళంలో ఉంది..
ఉగ్రనరసింహాలయానికితూర్పుదిశలో ఒక కిమీ దూరంలో భవనాశిని నది ఓడ్డున ఈ వరాహ నరసింహ ఆలయం ఉంది..ఈ స్వామిని క్రోడా నరసింహస్వామి అనికూడాపిలుస్తారు..ఇది భూదేవిని ఉద్దరించిన క్షేత్రంగా ప్రతీతి..స్వామి భుజములమీద భూదేవి ఉండటం విశేషంగా చెప్పవచ్చు .వేదాద్రి పర్వతం వద్ద ఉన్న వేదాలను, భూదేవిని అపహరించుకుని వెళ్లిన సోమకాసురుడి సంహారం కోసం నరసింహస్వామి వరాహ అవతారమెత్తారు..భూలోకం కిందకు వెళ్లి సోమకాసురుని వదించి భూదేవితో సహావేదాలను వరాహస్వామి తెచ్చాడని ప్రతీతి..అందుకే ఈ క్షేత్రానికి వరాహ నరసింహ స్వామి క్షేత్రమనిపేరు.ఇక్కడ లక్షిదేవితో ఆయనన భక్తులకు దర్శన మిస్తారు..స్వామి అనుగ్రహంతో రాహుగ్రహదోషములు తొలగునని భక్తుల విశ్వాసం.భక్తులుకాలినడకన ప్రయాణించి స్వామని దర్శించి పూజిస్తే కష్టాలు తీరగలవని నమ్మకం..