ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాలజిల్లా లోని ప్రముఖ ఆద్యాత్మిక క్షేత్రాలలోొ ఒకటి అహోబిలం..అహోబిలంలో కొలువైన నవనారసింహక్షేత్రాలు ప్రసిద్ది పొందాయి..అందులో ఉగ్రనరసింహస్వామి మొదటి క్షేత్రం..ఈక్షేత్రం ఎగువ అహోబిళంలో ఉంది..అహొబిళం కొండలలో అర్దచంద్రాకారంగా ఉన్న గరుడాద్రి కొండ వరుసలో మద్యలో ఉన్న కొండ చివరన ఈ ఉగ్రనరసింహస్వామి ఆలయం ఉంది.
ఆలయ గుహకు ముందు చిన్న గాలిగోపురం దాని తరువాత ఆలయ గుహ ఉంది..ముందుబాగంలో చిన్నముఖమండపం దాటిలోపలకు వెళితే లోపల ఒక చిన్న గర్బగుడి ఉంది..ఇది గుహాలయం కనుక ఈ ఆలయానికి తలుపులు ఉండవు..ఆలయంగా పిలువబడుతన్న ఈగుహ12 అడుగుల వైశాల్యంలో ఉంటుంది..గర్బాలయంలో నాలుగు అడుగుల ఎత్తుగల పీఠంమీద వీరాసనం వేసుకుని తొడలమీద హిరణ్యకశిపుని తలను చేతులను గట్టిగా అదిమి పట్టుకుని ఉన్న భంగిమలో ఉన్న స్వామివారు విగ్రహరూపంలోె భక్తులకు దర్శన మిస్తారు.
ఉగ్ర నరసింహునికి హిరణ్యకశిపుని వధించిన తరువాత ఉగ్రరూపం తగ్గక లేదు..ముక్కోటి దేవతలను ప్రార్ధించిన ఆయన శాంతించలేదు..చివరకు ప్రహ్లాదుడు భక్తితో ప్రార్ధించగా స్వామి వారు ఈగుహలోకి ప్రవేశించి శాంతిముర్తిగా ప్రహ్లాదుని ఆశీర్వదించారు..ఆలయంలో స్వామి ఎదురుగానే అంజలి ఘటిస్తూ నిలబడి ఉన్న విగ్రహమూర్తి ఉంది.పూర్వం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ఈ స్వామని దర్శించి పంచామృత స్త్రోత్రంతో పూజించాడని ప్రసద్ది అందువలన వారి విగ్రహాలు కూడ ఇచ్చట ఉన్నాయి..ఆది శంకరాచార్యులవారు ఈ స్వామిని కరావలంబ స్త్రోత్తంతో ప్రార్ధించి సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించారు..
శ్రీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరిస్తుండగా దేవతలందరూ ఆ ఉగ్రరూపాన్ని చూసి అహోబల అని కీర్తించారు.అహోబలవంతుడా అంటే గొప్ప బలవంతుడా అని అర్దం.అందువలన ఈ స్వామికి అహోబలుడు అనే పేరు వచ్చింది.అచ్చట ఆయన కొలువై ఉన్నందున ఈ ప్రాంతానికి అహోబిలంగా పేరు వచ్చింది..ఈ స్వామిని మనసారా సేవిస్తే భయం పిరికితనం వంటి గుణాలన్నీ సమసిపోతాయని భక్తుల విశ్వాసం .స్వామని సేవించినంతనే బృహస్పతి గ్రహము ప్రతికూలుడు కాగలడని భక్తుల నమ్మకం.
ఈ ఆలయం ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి 20 కిమీ దూరంలో ఉంది..రైలు మార్గం ద్వారా నంద్యాలకు చేరుకుంటే ఇక్కడినుండి ఆర్ టిసి ప్రవేటు బస్సులద్వారా ఆళ్లగడ్డకు చేరుకోవచ్చు..ఆళ్లగడ్డనుండి ఆర్ టిసి బస్సులు ప్రతి అరగంటకు కలవు