గుంటూరు సెప్టెంబర్ 20(ప్రజా న్యూస్): గుంటూరు పట్టణంలో వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు..పట్టణంలో వాడవాడలా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి గణనాధుని కి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.పట్టణంలోని అపార్ట్మెంట్ లలో ఓ బొజజగణపయ్య ప్రతిమలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..పట్టణంలోని ముత్యాల రెడ్డి నగర్ మూడవ లైన్ లో ఏర్పాటు చేసిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..ఇదే లైన్లో దేవ్ క్యాజీల్ అపార్ట్మెంట్ లో గణనాధుని విగ్రహం ఏర్పాటు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు..మూడు రోజులపాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ అన్న వితరణ చేశారు…ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భజన కార్యక్రమాలు..కాలనీ వాసులంతా కలిసి నిర్వహించిన వివిధ రకాల ఆటలు అలరించాయి..ప్రతి ఏటా అపార్ట్మెంట్ వాసులంతా కలిసి గణనాధుని వేడుకలు నిర్వహించి లడ్డు వేలం నిర్వహిస్తామని కార్యక్రమం నిర్వాహకులు కోటిరెడ్డి,సుబ్బారావు తెలిపారు..