నంద్యాల ఏప్రియల్ 21(ప్రజాన్యూస్):నంద్యాల పట్టణంలోనిా శ్రీ రామకృష్ణ డిగ్రీ & పీజీ కళాశాలలో సృజన శిబిరం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ అనంతపూర్ మరియు శ్రీరామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల సంయుక్తంగా ఎంట్రప్రెన్యూర్షిప్ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ CEO శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ ముఖ్య అతిథిగా ఇన్నోవేటర్ డా.శివకిరణ్ గారు విచ్చేశారు. డైరెక్టర్ జి.హేమంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ఎంటర్ప్రెన్యూర్షిప్పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ కె.బి.వి సుబ్బయ్య గ విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి , చైర్మన్ విద్యార్థులనుద్దేశించి SRK ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ సెంటర్ సహాయంతో స్టార్టప్ సెంటర్లను ఏర్పాటు చేయడమే ప్రధాన ధ్యేయమని. దేశానికే సేవ చేయాలని, ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలని అని సూచిస్తు విద్యార్థులను చైతన్యపరిచారు. విద్యార్థులకు ఎంటర్ప్రెన్యూర్షిప్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, అలాగే స్టార్టప్ సెంటర్లను ఏర్పాటు చేయాలని విద్యార్థులకు సూచించారు.డా.సుధామూర్తి భావన లను ను కూడా గుర్తు చేశారు- కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీలు ముందుకు వస్తున్నాయని చైర్మన్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అవసరమైన నిధులు ఇవ్వడానికి ఎప్పుడు ముందు ఉంటారని విద్యార్థులు అద్భుతమైన ఆలోచనలో ముందుకు రావాలని కోరారు. అనంతరం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సీఈవో డా.ఇన్నోవేటర్ శివకిరణ్ ప్రసంగిస్తూ తాను ఎన్నో డిగ్రీ కళాశాలలను సందర్శించానని, అయితే ఈ కళాశాల అత్యుత్తమ కళాశాలగా నిలిచిందన్నారు. సృజన స్రవంతి మాల కూడా రాయలసీమ ప్రాంతంలో మొదటిసారిగా శ్రీ రామకృష్ణా డిగ్రీ అండ్ పిజి కాలేజిలో మొదటి ఇంక్యుబేషన్ సెంటర్ ఉందని ఆయన అభినందించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.ఇన్నోవేటర్ శివకిరణ్కి సన్మానం చేశారు. అనంతరం సృజన స్రవంతి మాలలో చురుగ్గా పాల్గొన్నవిద్యార్థులకు సర్టిఫికెట్ పంపిణీ చేశారు.