ఆంధ్రప్రదేశ్ లో ముక్కలు గా చీలిపోయిన ఉద్యోగ సంఘాలు..!! అడుగడుగునా నిఘా..?

*సి.హెచ్.దామోదర్* సీనియర్ జర్నలిస్టు విజయవాడ

ప్రజాన్యూస్ డిశెంబరు 9ప్రజాన్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ముక్కలు ముక్కలుగా చీలిపోయారు.ప్రతి డిపార్ట్మెంట్ లోనూ పోటాపోటీగా కార్యవర్గాలు ఏర్పడ్డాయి.ఇదంతా గత రెండున్నర సంవత్సరాలుగా ఒక్కో శాఖలో గుర్తింపు పొందిన యూనియన్ కు పోటీ గా ఒక ప్రధాన సామాజికవర్గం ఉద్యోగులతో పోటీ సంఘం ఏర్పాటు చేయడంలో వైసీపీ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని చెప్పాలి.చాలా దూర దృష్టి తో ప్రభుత్వంలోని పెద్దలు దీనికి స్కెచ్ వేయడం అందుకు అనుగుణంగా పోటీ సంఘాలు ఏర్పాటు చేశారు అంటే ఉద్యోగుల్లో బలమైన చీలిక తీసుకు వచ్చారని స్పష్టం అవుతోంది.

పీఆర్సీ,మరో 71 సమస్యలపై యూనియన్ లు మంగళవారం నుంచి దశల వారీ ఆందోళనకు పిలుపు ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగుల్లో నల్లబ్యాడ్జీలు ధరించిన యూనియన్ గాని,ఉద్యోగులు కానీ నామమాత్రం అని చెప్పాలి.అంటే మెజార్టీ ఉద్యోగులు దశాలవారీ ఆందోళనకు దూరంగా ఉన్నారనేది గ్రౌండ్ లెవల్లో వాస్తవం కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో 147 సంఘాలు ఉన్నాయి.ఇందులో ప్రధానంగా బండి.శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ ఎన్జీవో  సంఘానికి(బండి.శ్రీనివాసరావు) ,ఏపీ సెక్రెటరీయేట్ ఫెడరేషన్ (వెంకట్రామిరెడ్డి) ,ప్రభుత్వ ఎంప్లాయిస్ అసోషియేషన్(సూర్యనారాయణ) కు గుర్తింపు ఉంది.బొప్పరాజు నేతృత్వంలో నడుస్తున్న అమరావతి జేఏసీ కుగుర్తింపు లేదు.

ఏపీ ఎన్జీవో అసోషియేషన్ ప్రదానమైన అసోషియేషన్ అయినప్పటికీ దీనికి అనుబంధంగా 106 సంఘాలు ఉన్నాయని చెపుతున్నప్పటికీఆమేరకుసంఘాలమద్దతులేదనిచెప్పాలి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ని సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ కు 95 సంఘాలు, ఎంప్లాయిస్ అసోషియేషన్ కు 60 సంఘాలు మద్దతు ఉందని స్ఫష్టం అవుతుంది.వెంకట్రామిరెడ్డి వైసీపీ ప్రభుత్వ ఆశీస్సులు తో సంఘాన్ని ఏర్పాటు చేయడం దానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడంతో అతను వైసీపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నాడు. దీంతో పీఆర్సీ పై దశల వారీ ఆందోళన కు వెంకట్రామిరెడ్డి మద్దతు లేదంటే సచివాలయంలో 3500 ఉద్యోగులు ఆందోళనకు మద్దతు లేదనే చెప్పాలి.ఇదే ఉద్యోగుల్లో చీలిక అంటే .అలాగే జిల్లాల వారీగా కూడా ప్రభుత్వానికి ఏ సంఘం మద్దతు ఉందో ఉద్యోగులు వారి వైపే ఉన్నారని స్పష్టం అవుతోంది.పీఆర్సీ కోసం ఆందోళనకు నడుంబిగించిన బొప్పరాజు, బండి.శ్రీనివాసరావు ల వెంట బలమైన సంఘాలు లేకుండా చేయడంలో వైసీపీ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో దశల వారీ ఆందోళనకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆశించిన మద్దతు లేకుండా వైసీపీ లో కీలక నాయకులు సఫలీకృతం అయ్యారని చెప్పాలి.అలాగే ఒక్కో శాఖలో పోటీ యూనియన్ వైసీపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గం ఏర్పాటు చేయడం కూడా ఆయా సంఘాలు ఆందోళనలో పాల్గొనడం లేదు.

*30 శాతం పీఆర్సీ ఖాయం?*
వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న యూనియన్లకు పీఆర్సీ విషయం లీక్ చేసింది. ప్రభుత్వం సుమారు 30 నుంచి 32 శాతం పీఆర్సీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.అదే విధంగా పాత హెచ్.ఆర్.ఏ నే కొనసాగించే అవకాశం కూడా ఉంది.తమ అనుకూల యూనియన్ కు లీక్ చేయడంతో ఇదే విషయాన్ని వెంకట్రామిరెడ్డి యూనియన్ రాష్ట్రా వ్యాపితంగా ఉన్న యూనియన్లకు, ఉద్యోగులకు చెప్పి దశల వారీ ఆందోళనలకు మద్దతు ఇవ్వవద్దని పిలుపు నివ్వడం వల్ల కూడా మెజార్టీ ఉద్యోగులు ఆందోళనకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంఘం,ట్రెజరీ ఉద్యోగుల సంఘం కూడా నిరసనలకు దూరంగా ఉన్నారు.దీన్నిబట్టి చూస్తే మొత్తం మీద ఉద్యోగులను విభజించడంలో ప్రభుత్వం పైచేయి సాదించింది.దీనికి తోడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంచింది.ఏ సంఘం,దాని క్రింద ఉన్న నాయకుల ప్రతి కదలిక ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరిపోతుంది.
*సి.హెచ్.దామోదర్*
*జర్నలిస్ట్,విజయవాడ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *