నంద్యాల, నవంబరు 23(ప్రజా న్యూస్):గత 23 రోజులుగా అమరావతి రాజధానికోసం న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తూ నెల్లూరి కి చేరుకున్న రైతులకు నంద్యాల ,ఆళ్లగడ్డ ప్రాంత కమ్మసంఘం నేతలు సంఘీభావం ప్రకటించారు.. ఈ మేరకు కమ్మసంఘ నేతలు నంద్యాల,ఆళ్లగడ్డనుండి బయలుదేరి నెల్లూరు చేరుకుని పాద యాత్ర రైతులకు మద్దతు పలికారు…ఈ సందర్భంగా నేతలు దూదిపళ్ల రమణ,వేమసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రాజధానికోసం గత ప్రభుత్వం హయాంలో తమ భూములు ధారాదత్తం చేసిన రైతులకు నేటి ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.. నాడు ప్రభుత్వం చేసిన చట్టాలను రద్దుచేసి 700 రోజులుగా రైతులను అనేక విధాలుగా వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. అమరావతి ని నిర్వీర్యం చేయడంతో పరిశ్రమలు రాక యువత ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రా ల దాయా దాక్షిణ్యా లపై ఆధారపడే దుస్థితి వచ్చిందన్నారు.. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించకుండా నేడు అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు వెనక్కు తీసుకుంటున్నామని తిరిగి మళ్ళి అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశ పెడతామని చెప్పడం ముఖ్యమంత్రి మంత్రి అనాలోచిత విధానాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఈ నేపద్యంలో రాజధాని రైతులకు ప్రతి జిల్లానుండి మద్దత్తు ఇవ్వవలసిన బాధ్యత ఉందని కమ్మసంఘ నేతలు గుర్తుచేశారు.. తమ వంతు భాద్యత గా నేడు నంద్యాల నుండి నెల్లూరు వెళ్ళి మహాపాదయాత్రకు మద్ధతు తెలుపుతున్నామని కమ్మ సంఘం నేతలు తెలిపారు…కాగా కమ్మసంఘ ర్యాలి కి టిడిపి నేత మాజీ వి ఆర్ ఓ మోహన్‌రెడ్డి సంఘీభావం తెలపడం విశేషం..కార్యక్రమంలో నేతలు గుంటుపల్లి హరిబాబు,చిలుకూరి రవికుమార్,వాసు,రావిళ్ళ సుబ్బారావు, బొర్రా సుబ్బారావు,వడ్లమూడి మల్లీశ్వర్ చౌదరి, గుర్రం హరిబాబు,సాంబశివరావు,శంకర్ రావు వందలాదిమంది కమ్మసంఘ నేతలు ఉన్నారు