నంద్యాల.. అక్టోబరు 30(ప్రజా న్యూస్): పాన్ ఇండియా అవేర్ నెస్ అండ్ అవుట్ రిచ్ ప్రోగ్రాం ఆజాదిక అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు న్యాయమూర్తి అమ్మన్న రాజా నేతృత్వంలో ప్రజలకు న్యాయవాదులు ఇంటిటికి తిరిగి న్యాయ విజ్ఞానం అందిస్తున్నారు…ఇందులో భాగంగా సబ్ జైలు ప్యానెల్ న్యాయవాది బత్తిని శివప్రసాదరావు దొర్ని పాడు మండలం రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ తిరిగి మహిళలకు వృద్దులకు యువతకు న్యాయ విజ్ఞానం అందించారు..ముఖ్యంగా మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిహక్కు పొందడం,గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు.. కన్న పిల్లలు పట్టించుకోపోతే న్యాయపరంగా ముదుసలి తల్లిదండ్రులు తగిన న్యాయం పొందవచ్చు అన్న విషయాలను వివరించారు..నిరుపేదలు మహిళలు ఏదీ ని న్యాయపరమైన సమస్యలు వస్తే ఉచితంగా న్యాయం ఎలా పొందాలి ఎవరిని సంప్రదించాలి అన్న విషయాలను న్యాయవాది గ్రామ ప్రజలకు ఇంటింటికీ తిరిగి వివరించి వారిలో అవగాహన కల్పించారు