కోవిడ్ నిబంధనలతో వినాయక చవితి జరుపుకోవాలన్న సబ్ కలెక్టర్ చాహత్ భాజపేయ్

నంద్యాల సెప్టెంబర్ 4(ప్రజాన్యూస్):ఈనెల 10వ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయరాదని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. పేర్కొన్నారు.

శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ .నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. గణేశ్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల తో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్. నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి .మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో 5 రోజుల పాటు నిర్వహించుకుందామన్నారు. ఎంతో ఆనందంగా నిర్వహించుకునే ఈ పండుగ దురదృష్టవశాత్తు గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ వలన చాలా వరకు కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గత రెండు నెలల క్రితం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పనిచేస్తున్న వారు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా తమ పిల్లలను దగ్గరకు తీసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. వినాయకుని విగ్రహాలను దేవాలయాలలో. ఇళ్లలో . అపార్ట్మెంట్స్ లలో మాత్రమే ప్రతిష్టించాలి అని అన్నారు. కోవిడ్ దృశ్య ఉత్సవాలలో తీర్థ ప్రసాదాలు వితరణ చేయరాదన్నారు విగ్రహా ప్రతిమలు మూడు అడుగుల లోపల మాత్రమే ఉండేలా చూసుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనము రోజున ఎలాంటి హంగు ఆర్భాటాలతో డిజె సౌండ్ల తో గుంపులు గుంపులుగా నిర్వహించరాదన్నారు

మున్సిపల్ శాఖ వారు పారిశుద్ధ్య సిబ్బంది తో వీధులను శుభ్రం చేయించాలని. అవసరం ఉన్న చోట త్రాగు నీటిని ఏర్పాటు చేయాలని. చిన్న చెరువు వద్ద లైటింగ్ లు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు

పోలీస్ శాఖ వారు వారి వారి పరిధిలో ప్రతిష్టించిన విగ్రహాల వద్ద ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఎలాంటి దొంగతనాలు జరగకుండా నిఘా ఉంచాలని. స్టేషన్ పరిధిలో ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు .వాటి వివరాలను ప్రతిష్టించుట కొరకు బాధ్యత తీసుకున్న వారి సెల్ ఫోన్ నెంబర్లతో సహా వారి వద్ద ఉంచుకోవాలని అన్నారు.

రహదారులు మరియు భవనాల శాఖ వారు చిన్న చెరువు కట్ట వద్ద రోడ్డును మరమ్మత్తు చేయించి బ్యార్గెట్ లను ఏర్పాటు చేయాలన్నారు.

అగ్నిమాపక శాఖ వారు వారి సిబ్బందితో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించాలని గజ ఈతగాళ్లను కూడా లైవ్ జాకెట్ ల తో ఏర్పాటు చేయాలన్నారు

విద్యుత్ శాఖ వారు నిమజ్జన సమయంలో నిమజ్జనానికి అంతరాయం కలగకుండ. విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలన్నారు.

ఆర్టీసీ వారు నిమజ్జనం రోజున ఆత్మకూర్ వైపునుండి మహానంది వైపునుండి వచ్చేటువంటి బస్సులను రూట్ మార్చి నడపాలని ఆర్టీసీ వారిని ఆదేశించారు.

రోడ్డు రవాణా శాఖ వారు నిమజ్జన సమయంలో విగ్రహాలను నిమజ్జనం నిమిత్తం ఒక క్రేన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వైద్య ఆరోగ్య శాఖ వారు నిమజ్జనం రోజున చిన్న చెరువు కట్ట వద్ద ఒక్క అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని వైద్య శాఖ వారిని ఆదేశించారు.

ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు నిమజ్జనం రోజున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కొరకు లైవ్ జాకెట్ కలిగిన గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు

నంద్యాల తహసిల్దార్ మరియు నంద్యాల డివిజనల్ డెవలప్మెంట్ అధికారి. వినాయక చవితి నుండి నిమజ్జనం రోజు వరకు అన్ని విధాలా పర్యవేక్షించాలి అన్నారు

గణేష్ నిమజ్జన కమిటీ సభ్యులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఎలాంటి ఆటంకాలు జరుగకుండ సంబంధిత అధికారులు కూడా సహకరించాలని అందుకనుగుణంగా కమిటీ వారం కూడా పూర్తి సహకారాలు అందించి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ గణేష్ ఉత్సవాలను జరపడానికి పూర్తిగా సహకరిస్తామని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది మున్సిపల్ ఇంజనీర్ మధు. మున్సిపల్ వైస్ చైర్మన్ గంగి శెట్టి వెంకట నాగ శ్రీధర్ . ఆర్లగడ్డ తహసీల్దార్. ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ . ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ రెడ్డి . రెండో పట్టణ సీఐ రమణ.మూడవ పట్టణ సి ఐ మోహన్ రెడ్డి. తాలూకా సిఐ మురళి మోహన్ రావు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి యోగేశ్వర రెడ్డి .వినాయక ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి.గౌరవ అధ్యక్షులు డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి. అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్ కార్యదర్శి నెరవాటి అమర్నాథ్ అడ్వైజర్ అల్వాల సత్యనారాయణ. సభ్యులు. చలం బాబు. జిల్లెల శ్రీనివాసులు. చింతలపల్లె వాసు. చెన్నంశెట్టి పుల్లయ్య. మోహన్ గుప్తా. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *