ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
నంద్యాలఆగస్టు26(ప్రజాన్యూస్): కొత్తవంగడాలు సృష్టించడంలో చరిత్ర సృష్టిస్తున్న కర్నూలుజిల్లా నంద్యాల వ్యవసాయపరిశోదనాస్థానం మరో కొత్త వంగడం సృష్టించి మరో చరిత్రకెక్కింది..
ఈపరిశోదనా స్థానంనుండి ఇటీవల కొత్తశనగరకం NBEG-857 రకం విడుదలయినట్లు పరిశోదనాస్థానం ADR డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు..ఈవంగడం నూతన రకం విడుదలతో నంద్యాలపరిశోదనాస్థానం చరిత్రలో మరో మైలు రాయి వచ్చి చేరిందని పరిశోెదన సహసంచాలకులు (ADR) వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తంచేశారు..వంగడం సృష్టికర్త మరియు ప్రదాన శాస్త్రవేత్త డాక్టర్ డి వీరజయలక్ష్మిని ఈసందర్బంగా ADR డా వెంకటేశ్వర్లు అబినందించారు.,.
కొత్తరకం వంగడం గురించి సీనియర్ శాస్ట్రవేత్త మంజునాద్ మాట్లాడుతూ17.8.2021 వతేదీన అఖిలభారత సమన్వయపదకం వారు నిర్వహించిన పప్పుదినుసుల వార్షిక సమావేశంలో ఈరకం శనగ ను నిర్దారించారన్నారు..ఈరకం గింజలు చూడటానికి ఆకర్షనీయంగా JG-11 మాదిరిగానే ఉంటాయని పంటకాలం 95నుండి 100రోజులు ఉంటుందన్నారు..ఈరకం దక్షిణభారతదేశంలో అనగా ఆంద్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణా మరియు తమిళనాడు రాష్ట్రాలలో సాగకు అనుకూలమైనదని .గత మూడు సంవత్సరాలుగా అఖిాలభారత సమన్వయ పదకం నిర్వహించిన పరీక్షలలో ఈరకం ఇప్పుడున్న పేరు పొందిన జాకీ9218 రకంపైన 14.7శాతందిగుబడిని నమోదుచేసిందని డాక్టర్ మంజునాద్ తెలిపారు..ఓక్కదిగుబడిలోనే కాకుండా చీడపీడలను కూడా తట్టుకునే గుణాన్ని కలిగి ఉండటం వలన రైతులు అదిక లాబాన్ని పొందవచ్చని ప్రస్తుతమున్న విత్తనరకాలు అన్నింటితో పోలిస్తే ఈరకం అనేక రకాలుగా మెరుగైనదని, ఈ వంగడం సృష్టికర్త ప్రధాన శాస్ట్రవేత్త డీ వీర జయలక్మి తెలిపారు..కాగా ఈరకం 100 గింజల బరువు 23.4గ్రా ప్రోొటీన్ శాతం 21.7 మరియిు గింజనుండి పప్పు శాతం75శాతంగా నమోదయ్యాయి.ఈరకం విడుదలలో శాస్త్రవేత్త డా కామాక్షి డారమాదేవి,డా త్రివిక్రమ, డా. చైతన్య, డా .సతీష్ బాబు డా రాఘవేంద్ర మరియు డా .ఎంవి రమణ ప్రదాన పోత్రపోషించారని డాక్టర్ మంజు నాద్ తెలిపారు