నంద్యాల ఆగస్టు18(ప్రజాన్యూస్):రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లాప్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 42 వార్డులలో మునిసిపల్ కమీషనర్ వెంకటకృష్ణ విస్త్రతంగా ప్రజలకు అవగాహన కార్యక్రమంచేపట్టారు..ప్రతిరోజు ఉదయాన్నే లేచి రోజుకురెండు వార్టులలో పర్యటిస్తూ క్లాప్ పై అవగాహన పెంచుతున్నారు..ప్రతి వార్డు పరిదిలో సచివాలయ సిబ్బందితో మమేకమై ప్రజలకు మూడురకాల ప్లాస్టిక్ చెత్త బుట్టలను పంపిణీచేస్తూ తడి పొడి ప్రమాదకర చెత్తను డివైడ్ చేసి ఇవ్వాలని మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు..ఇందులో బాగంగా బుదవారం పట్టణంలోని 21 వవార్డులో ఆయన పర్యటించారు..వార్టు పరదిలోని జర్నలిస్టుకాలని,బృందావనం కాలనీ, టీచర్స్ కాలనీ, భూమానగర్ ప్రాంతాలలో సచివాలయం సిబ్బంది స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి తో్పాటుగా ఆయన కాలనీల్లో ప్లాస్టిక్ బుట్టలనుమహిళలకుఅందిాంచారు..ఈసందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ కాలువల్లో చెత్త చెదారం వెయ్యరాదని ప్రతి ఇంట్లో చెత్తును మూడురకాలుగా విభజించి మునిసిపల్ సిబ్బంది మొబైల్ డస్ట్ బిన్ కి అందించాలన్నారు…పారిశుద్య లోపం వల్ల వచ్చే వ్యాదులను తరిమికొట్టేందుకు ప్రతిఓక్కరు మునిసిపల్ అదికారులతోొ సచివాలయం సిబ్బందితో సహకరించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు..కార్యక్రమంలో మునిసిపల్ డిఇ మధు,సచివాలయం అడ్మిన్ త్యాగరాజు ఎఎన్ ఎం వాలంటీరు సమీర్ పాల్గొన్నారు..