ఆళ్లగడ్డ మాజీ సైనికులకు 75వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా సైనిక భవన్ నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఆవుల ఫుల్లారెడ్డి సేవాసమితి

ప్రభాకర్ చౌదరి ప్రజా టివి వెబ్ న్యూస్ ప్రతినిధి

ఆళ్ళగడ్డ ఆగష్టు 15(ప్రజాటివి వెబ్ న్యూస్):కర్నూలు జిల్లా లో ఆళ్లగడ్డ మాజీ సైనికులకు 75వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా సైనిక భవనాన్ని తన స్వంత స్థలంలో తానే నిర్మించి వారి

పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు ఆవుల ఫుల్లారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు ఆవుల భాస్కర రెడ్డి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన మాజీ సైనికులు , వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాలయం నిర్మించుకోవాలని గత 30  సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వున్నారు.కానీ వారికి సహకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వారి కల కలగానే మిగిలింది..ఈ నేపద్యంలో పట్టణంలో ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి వ్యవస్థాపకుడు,విభారె పత్రికాధిపతి ఆవుల పుల్లారెడ్డి పట్టణంలో చేస్తున్న సామాజిక సేవాకార్యక్రమాలని విన్న మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు చింతకుంట దస్తగిరిరెడ్డి తమ ప్రయత్నంలో భాగంగా ఆవుల పుల్లా రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి ని కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. వారి సమస్యను విని   ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. ఆరునెలల సమయంలోనే  తన స్వంత  స్థలంలో, సొంత ఖర్చులతో భవనం ఉచితంగా  నిర్మించి ఇచ్చారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా  ఆ భవనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి  ప్రారంభోత్సవం చేశారు. 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దాదాపు 22 లక్షల రూపాయల  విలువచేసే   ఆ కార్యాలయాన్ని ఆళ్లగడ్డ మాజీ సైనిక ఉద్యోగుల సంఘం పేరుమీద ఉచితంగా ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో  రిజిస్టర్ చేసిన దస్తావేజులను వారికి కానుకగా ఇచ్చాడు. సహజంగా దేశభక్తుడు, జంతు ప్రేమికుడు అయిన భాస్కర్ రెడ్డి తన ఇంట అపురూపంగా పెంచుకున్న కుక్క పిల్ల టామి పేరునఆ భవనానికి “టామీ  మెమోరియల్ సైనిక్ భవన్” గా నామకరణం చేశాడు. ప్రభుత్వ స్థలాలని సైతం కబ్జా చేస్తున్న నేటి రోజుల్లో అడిగిిిన వెంటనే కార్యాలయ భవనాన్ని  ఉచితంగా నిర్మించి ఇవ్వడం పట్ల ఆర్లగడ్డ మాజీ సైనికోద్యోగుల సంఘం ఆయనను ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేసి,కృతజ్ఞతలు తెలిపింది.ఈ సందర్భంగా మాజీ సైనికులు మాట్లాడుతూ భవిష్యత్తు లో భాస్కర్ రెడ్డి చేపట్టే అన్ని సేవాకార్య క్రమాల్లో తాము కూడా పాలు పంచుకుంటామన్నారు.అనంతరం ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి అధ్యక్షుడు,విభారె పత్రిక సంపాదకులు అయిన ఆవుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ కుటుంబానికి సైతం దూరంగా ఉంటూ దేశ సేవ చేసిన మాజీ సైనికులకు ఎంత చేసినా తక్కువే అన్నారు..మాజీ సైనికులు నిత్య జీవితంలో ఎదుర్కుఉంటున్న సమస్యలు చూస్తే మనం సిగ్గు పడాలన్నారు.. ప్రభుత్వ కార్యాలయ ల్లో వారి సమస్యలు వెంటనే పరిస్కారం అందించి వారికి సముచిత గౌరవం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఆళ్లగడ్డ మాజీ సైనిక ఉద్యోగుల సంఘమునకు సహాయం చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగాఆవుల విజయభాస్కరరెడ్డి, లతా రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సైనిక సంఘఅధ్యక్షులు సి దస్తగిరి రెడ్డి, గౌరవాధ్యక్షులు రామసుబ్బయ్య, ఉపాధ్యక్షులు బి బాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్  జి మహబూబ్బాషా, కార్యదర్శి ఏవి లక్ష్మిరెడ్డి  పాల్గొన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *