రైతునగరం భూకైలాసం ఎకరా 6కోట్లు ..నట్టేట ముంచిన రియల్టర్లు..బ్రోకర్లు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది 
⇒నంద్యాలలో రియల్టర్ల మాయాజాలం
⇒అనుమతిలేని ప్లాట్లు కోట్లకు అమాయకులకు అమ్మకాలు
⇒ఇల్లు కట్టుకోవాలంటే అనుమతులు లేవంటున్న అదికారులు
⇒ప్రొహిబిటెడ్ లిస్టులో రైతునగర్ లే అవుట్లు
⇒లబోదిబో మంటున్న కొనుగోలుదారులు
నంద్యాలఆగస్టు8(ప్రజాన్యూస్):నంద్యాల జిల్లా అయిపోయింది…ఇక్కడే కలెక్టరేట్..ఇదిగో ఇదిగో ఇక్కడే జిల్లా కార్యాయాలు..అంటూ నంద్యాలపట్టణం అంతా భూమాయచేశారు రియల్టర్లు ,బ్రోకర్లు..ముఖ్యంగా నంద్యాలపట్టణ శివార్లలోని నూనేపల్లె బ్రిడ్జినుండి కోవెలకుంట్ల రహదారి చుట్టుపక్కల రైతునగరం కానాల వరకు పదికిలోమీటర్ల మేర చాబోలు రోడ్డులో రియల్డర్లు తమ మాయాజాలం ప్రదర్శించారు..దీంతో ఇంటికో బ్రోకర్ ఇంటికొకరు రియల్ వ్యాపారం మొదలు పెట్టారు.ఇంకేముంది..రూ.50లక్షలవిలువ ఉన్న ఎకరాపొలం 6కోట్లకు చేర్చారు..ఇక్కడ వక్ప్ భూములకుసైతంరేట్లుగట్టిఎకరం5కోట్లకుచేర్చారు..నంద్యాలకోవెలకుంట్లరోడ్డుకు ఇరువైపులు 5 కిలోమీటర్లవరకు రియల్ దందానడిపారు..ఇంకేముంది నంద్యాల జల్లా అయిపోతోందని డబ్బు ఉన్న మారాజులు పెట్టుబడులు స్టార్ చేశారు..భూమ్ క్రియేట్ చేశారు..వీరినినమ్మి సామాన్య మద్యతరగతి వారు కూడా అప్పోసప్సో చేసి ఇక్కడ ప్లాటులు కొన్నారు..కొంటే రేట్లు పెరిగితే మీకేమి భాద అంటారేమో..ఇక్కడే రియల్టర్లు బ్రోకర్లు పుట్టెముంచేశారు..రైతునగరం సమీపంలోని భూములు నూనేపల్లె రెవెన్యూ డివిజన్ పరిదిలో ఉన్నాయి..ఈ భూములను ఎకరా 50లక్షలనుండి 3కోట్లవరకు కొని రియల్టర్లు ప్లాట్లు వేశారు.సెంటు రూ.5లక్షలనుండి 16 లక్షలవరకు అమ్మేశారు..అయితే ఈ ప్లాట్లకు అనుమతి లేదు.,.కేవలం రాజకీయ పలుకుబడితే అదికారుల అండదండలతో ప్లాట్లను విక్రయించుకుని సొమ్ముచేసుకున్నారు..ఈకోవలో బ్రోకర్లుసౌతం కమీషన్ క్రింద కోట్ల కొట్టేసి వెనకేసుకున్నారు..ఇప్పుడు కొన్న వారి పని మొదలయింది..అనుమతిలేని ప్లాట్లను రెడ్ లిస్టులో పెట్టారు అదికారులు..అనుమతి లేని లే అవుట్లను డిటిసిపి ప్రోహిబిషన్ లిస్ట్ లోపెట్టారు..పట్టణంలోని 90 కిపైగా లే అవుట్లు అనుమతిలేకుండా ఉండటంతో అదికారులు తమపనితాము చేశారు..గతంలో ఈ ప్రాంతం అంతా పంచాయితీ పరిదిలో ఉండటంతో పంచాయితీ సర్పంచ్ సెక్రటరీ ఎంపిడిఓలను మేనేజ్ చేసుకుని కొంతమంది ఇంటినిర్మాణానికి అనుమతి తెచ్చుకున్నారు..అయితే కొత్తగా ఈ ప్రాంతం మునిసిపల్ పరిదిలోకి రావడంతో నిబందనలు అన్నీమారిపోయాయి..ఇంటినిర్మాణానికి ఖచ్చితంగామునిసిపల్ లే అవుట్ అవసరం..ఇదికావాలంటే ప్లాట్లు అన్నీ నిబందనలమేరకు డిటిసిపి అప్రూవల్ అయిుఉండాలి..ఇవేమీ లేకపోతే ఎల్ ఆర్ ఎస్ స్కీం క్రింద 14శాతం పెనాల్టి చెల్లించి అనుమతులకు వెళ్లాలి..ఈ తతంగం పూర్తి కావాలంటే సెంటుకు మరో లక్షవరకు చెల్లించుకోవాల్సిందే..దీనికితోడు ఎల్ ఆర్ ఎస్ పదకం ఇప్పుడు లేదు..మళ్లీ ప్రభుత్వం ఈపదకంపెట్టే దాక ఇళ్లకు అనుమతులు రావు..ఒకవేళ నిర్మించిన అవసరం అయితే అదికారులు కూల్చేసే అవకాశం ఉంది.దీంతో ఈప్రాంతంలో ఇప్పటివరకు రియల్టర్లు బ్రోకర్ల మాయకు బలైన అమాయకులు లబోదిబో అంటున్నారు..అమ్మేసిన రియల్టర్లు,బ్రోకర్లు హ్యాపీగా లగ్జరీ కారులో తిరుగుతుంటే డబ్బుచెల్లించి కొనుగోలుచేసిన అమాయకులు మాత్రం కాగితాలు పట్టుకుని చెప్పులు అరిగేలా అదికారులచుట్టూ తిరుగుతున్నారు..ఇదిలా ఉండగా ప్రభుత్వమే సెంటు పదిలక్షలకు ఈ ప్రాంతంలో అన్ని హంగులతో ఇచ్చేందుకు సిద్దమయితే కనీసం ఏసౌకర్యంలేకుండా సెంటు 15లక్షలకు కొనుగోలుచేశామని ఇప్పడు మళ్లే సెంటుకు కనీసం లక్ష ఖర్చుపెడితే గాని తమకు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చే అవకాశంలేకుండా పోయిందని బాదితులు వాపోతున్నారు..ఇప్పటికైనా ఈప్రాంతంలో రెరా చట్టానికి వ్యతిరేకంగా తయారైన బ్రోకర్లను రియల్టర్లను గుర్తించి తగు చర్యలు తీసుకొని ఎవరు పడితే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ ప్రజలను మోసంచేయకుండా చూడాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *