నవరత్నాలు పేదలందరికీ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి..జె సి లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ఆగస్టు 15 వ తేది లోపల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి.

జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య

జాయింట్ కలెక్టర్( రెవెన్యూ) యస్. రామచంద్ర రెడ్డి

నంద్యాల, ఆగస్టు5(ప్రజాన్యూస్):ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి అని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య. జాయింట్ కలెక్టర్( రెవెన్యూ) యస్. రామచంద్ర రెడ్డి అన్నారు

గురువారం నంద్యాల మునిసిపల్ సమావేశం భవనంలో నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంను జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య.జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ ) ఎస్ రామసుందర్ రెడ్డి .నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్.హౌసింగ్ పి డి వెంకటనారాయణ.శ్రీశైలం శాసనసభ్యులు శిల్ప చక్రపాణి రెడ్డి.నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి .నిర్వహించారు.

జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమానికి సంబంధించి ఆగస్టు 15వ తేదీ లోపల ఇళ్ల నిర్మాణాలకు విద్యుత్, నీటి సరఫరా ఏర్పాటు చేయాలని. బేస్ మట్టం లెవల్ లోపల ఉన్నటువంటి గృహాలను సెప్టెంబర్ 15 వ తేదీ నాటికి బేస్ మట్టం లెవెల్ వరకు తీసుకురావాలని అన్నారు అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నీటి సరఫరా, విద్యుత్తు సప్లై తప్పకుండా ఉండాలన్నారు. ఇవిలేకపోతేఇంటినిర్మాణాలుపూర్తిచేయలేమన్నారు.ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో అధికారులు జగనన్న కాలనీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎక్కడెక్కడ మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా అవసరమో గుర్తించి వెంటనే నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు.జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్ మండల స్థాయి, డివిజన్ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన మౌళికసదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. నిర్మించనున్న జగనన్న కాలనీలకు ఇచ్చిన లేఅవుట్లలో ఇండ్ల నిర్మాణానికి అనువుగానిభూమిఉన్నయడలవాటికిప్రత్యామ్నాయంగాలే అవుట్లను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. రెవెన్యూ డివిజన్ లోని మండలాల వారీగా గృహ నిర్మాణాలకు సంబంధించి సంబంధిత తహసీల్దార్లను ఏం డిఓ అను పంచాయతీరాజ్ వారిని హౌసింగ్ వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంనా ము అన్నారు లేఅవుట్లలో ఎత్తుపల్లాలు ఉన్న వాటిని చదును చేయాలని చదును చేయడానికి కావలసిన ప్రతిపాదనలు కూడా వెంటనే పంపించాలనిసంబంధితఅధికారులనుఆదేశించామన్నారు జగనన్న కాలనీలలో మ్యాపింగ్. జియో ట్యాగింగ్. రిజిస్ట్రేషన్ వంటి కార్యక్రమాలు సంబంధిత అధికారులు దగ్గరఉండి చేయించాలన్నారు గ్రామాలను తలపించే జగనన్న కాలనీలను సంబంధిత అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు

జాయింట్ కలెక్టర్( రెవెన్యూ) యస్. రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా చేపట్టిననవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మండలంలోని తహసీల్దార్లు జగనన్న ఇళ్ల కొరకు స్థలాలు సేకరించేటప్పుడు నివాస యోగ్యం అయినవా. గృహనిర్మాణానికి అనువైన భూమి ఉన్నదా అన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని గ్రామానికి సమీపంలోనే స్థలాలు సేకరించుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందని. ఆయన అన్నారు క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అలాంటి సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం భూముల రికార్డులను స్వచి కరణ. కార్యక్రమం జరుగుతున్నదని ముఖ్యంగా గ్రామాలలో గ్రామ కంఠం మార్చి సరిహద్దులు ఏర్పాటు చేయవలసి ఉంటుంది అన్నారు సరిహద్దులు ఏర్పాటుకు రెవిన్యూ సిబ్బంది పంచాయతీరాజ్ శాఖ వారు ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి ఖచ్చితమైన కొలతలు వేసి గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేయవలసి ఉంటుంది అన్నారు రెవిన్యూ సిబ్బంది యం డి యు వాహనాలపై దృష్టిపెట్టి అర్హులైన అందరికీ రేషన్ అందేలా చూడాలన్నారు రెవిన్యూలో. ఫ్యామిలీ సర్టిఫికెట్స్. కుల ధ్రువీకరణ పత్రాలు. స్పందన కార్యక్రమం లో వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా తహసీల్దార్లు చూడాలన్నారు. హౌసింగ్ కొరకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి 90 రోజుల్లో పట్టా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

శ్రీశైలం శాసనసభ్యులు శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ. తమ నియోజకవర్గంలో జగనన్న కాలనీల కొరకు ఇచ్చే ఇండ్లు రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకే చోట ఇస్తున్నారని అలా కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామసమీపంలోనే జగనన్న కాలనీలు ఏర్పాటు చేయాలన్నారు తమ నియోజకవర్గం లోని వెలుగోడు మండల కేంద్రంలో పట్టాలు ఇచ్చారని అవి కోర్టుల్లో ఉన్నాయని వాటికి ప్రత్యామ్నాయంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు.తమ నియోజకవర్గంలో నీటి శాతం ఎక్కువగా ఉండే భూమి కావున లేఔట్ లలో నిర్మించే రోడ్లను ఎక్కువ నాణ్యత కలిగిన మెటీరియల్ చేత రోడ్లు నిర్మించాలని కోరారు.

నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో జగనన్న కాలనీల కొరకు సేకరించిన భూములపై కోర్టువ్యాజ్యంలోవున్నా యని అధికారులు చొరవ తీసుకొని కోర్టులో క్లియర్ చేయించి నంద్యాల ప్రజలకు జగనన్న గృహాలు అందిచాలన్నారు గోస్పాడు మండలం లో నాగులవరం గ్రామం దగ్గర నాగులవరం. సాంబ వరం. కానాల పల్లె. ఈ మూడు గ్రామాలకు కలిపి ఒకే చోట పట్టాలు ఇచ్చారని అలా కాకుండా ఏ గ్రామం దగ్గర ఆ గ్రామం వారికి పట్టాలు ఇప్పించేలా చూడాలని కోరారు చాపిరేవుల గ్రామ సమీపంలో 50 కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు కానీ వాటిని కూడా కొంతమంది కోర్టులో వేశారు కానీ వారికి మూడు నెలల్లోనే పట్టాలు ఇస్తామని తాముహామీ ఇచ్చామనివాటికి ప్రత్యామ్నాయంగా భూ సేకరణ చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. నంద్యాల సమీపంలోని పీవీ నగర్ కాలనీలో 170 మంది గృహాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారనిఅర్హులైనవారికిగృహాలుకేటాయించాలన్నారు. చాబోలు లోని యస్ సి లు వారి గ్రామ సమీపంలోనే వారికిజగనన్న గృహాలు ఇప్పించాలని కోరుతున్నారని అర్హత కలిగిన వారందరికీ గృహాలు కేటాయించేలా చూడాలని కోరారు

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి వెంకటనారాయణ, ఆర్ డబ్ల్యూ ఎస్. ఎస్ ఈ విద్యాసాగర్, నంద్యాల మున్సిపల్ చైర్మన్ మబునిసా . హౌసింగ్ సిబ్బంది.మున్సిపల్ కమిషనర్లు.పంచాయతీ రాజ్ సిబ్బంది. ట్రాన్స్కో అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, డివిజన్లోని తహసీల్దార్లు. డిప్యూటీ తహసీల్దార్లు . డివిజన్ లోని ఎంపీడీవోలు ఈవో ఆర్ డి లు .తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *