మహానందీశా..కోనేరులో స్నానానికి అనుమతి ఇప్పించు స్వామీ..

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది

నంద్యాలజూల్లై29(ప్రజాన్యూస్):మహానందీశ్వరా నీదర్శనానికి అనుమతి లభించింది.నీసన్నిదిలో స్నానమాచరిాంచేందుకు అనుమతించు తండ్రీ అంటూ మహానందీశ్వరుడిని భక్తులు వేడుకుంటున్నారు.కరోనాతో మూసిన కోనేరు తలుపులు తెరుచుకోవాలని ప్రార్తిస్తున్నారు..

గతయేడాదికాలంగా కరోనా విజృంభణ నేపద్యలో విడతలవారిగా ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది దర్శనాలను రద్దుచేశారు..కరోెనా తీవ్రత తగ్గినప్పుడు దర్శనాలకు అనుమతి ఇచ్చారు..అయితే మహానంది దర్శనమంటేనే రుద్రగుండంలో కోనేటిస్నానం అనిభక్తులనమ్మకం..మహానందిలో కొండలోయల్లోంచి ఎక్కడునుంచి వస్తుందో తెలియని అతిస్వచ్చమైన నీటిని భక్తులు స్వామి వారిి అభిషేకం నీటిగానే భావిస్తారు..కాసినినీరు నెత్తిన చల్లుకున్నా సర్వపాఫహరణగా భావిస్తారు..మహానంది కోనేరులో స్నానమాచరిస్తే సకలపాపలు తొలిగిపోయినట్లుగా భక్తులు భావిస్తారు..స్వామివారి దర్శనానికంటే అనేక ప్రాంతాలనుండి వచ్చే భక్తలు స్వామి వారి సన్నిదిలోని కోనేటి స్నానానికే అత్యంతప్రాదాన్యత ఇస్తారు..అయితే దేవాదాయశాఖ అదికారులు స్వామివారి దర్శనానికి అనుమతిని ఇచ్చినప్పటికి రుద్రగుండంలో స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు మనో వేదనచెందుతున్నారు..కరోనా నిబందనలన్నీ తూచ్ అని ప్రభుత్వం పర్యాటక శాఖతో్ సహా అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చినప్పటికి దేవాలయాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగించడం పట్ల భక్తులు ఆవేదన చెందుతున్నారు..ఆగస్టు 15నుండి అన్ని పాఠశాలలుకూడా తెరిచేందుకుప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని హిందువుల మనోభావలకు కూడా విలువిచ్చి దేవాలయాల ప్రాశస్త్యం ప్రకారం అక్కడి ఆచార అలవాట్లకు అనుమతులు ఇవ్వాలని భక్తులు కోెరుతున్నారను..ముఖ్యంగా మహానందిలో గర్బాలయం ప్రవేశ దర్శనంతోపాటుగా కోనేరులో స్నానమాచరించేందుకు అనుమతులు ఇవ్వాలని భక్తుులుకో్రుతున్నారు..ఇప్పటికైనా దేవాదాయశాఖ మహానందితోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో ఆంక్షలు తొలగించాలని భక్తులు కోరుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *