ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
నంద్యాలజూలై24(ప్రజాన్యూస్):శనివారం మరియు గురుపౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లా రుద్రవరం మండలం శ్రీ వాసపురం వేంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామ స్మరణతో భక్తులతో పోటెత్తింది
కరోనా నేపద్యంలో 3 వారాలుగా ఏకాంత సేవలు పొందిన వేంకటేశ్వరుడు శనివారం మరియు గురు పౌర్ణిమ సంధర్భంగా భక్తులతో విశేష సేవలు పొందారు..ఉదయం నుండి వాసపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాgగణం గోవింద నామ స్మరణ తో మారు మ్రోగింది.. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు..కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన మెదరమెట్ల శ్రీధర్,సుష్మశ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు. వస్త్రములు సమర్పించగా గోపి శర్మ స్వామి అమ్మవార్లను కనులపందువుగా అలంకరించారు… అనంతరం అర్చకులు గోపిశర్మ భక్తులకు విడివిడిగా గోత్రణామాలు చెప్పించి స్వామి అమ్మవార్లకు కుంకుమ పూజ నిర్వహించారు.. అనంతరం ఆలయకమిటీ చైర్మన్ మధుసూధరెడ్డి రంగనాయకులు నరసింహులు ఆద్వెర్యంలో నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీకి చెందిన కృష్ణా రెడ్డి భక్తులకు ప్రసాదం అల్పాహారం అందించారు..అనంతరం కృష్ణా జిల్లా పరిటాలకు చెందిన మెదరమెట్ల శ్రీధర్ సుష్మశ్రీ దంపతులు స్వామివారికి రూ 25 వేల నగదును ఆలయ కమిటీ చైర్మన్ మధుసూధరెడ్డి కి అందించారు… కార్యక్రమంలో పలు ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు