ఆకస్మికంగా గ్రామ సచివాలయాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు వీరపాండ్యన్.బుక్కాపురం సెక్రెటరీ కి షో కాజ్ నోటీస్.

 

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి

కర్నూలు, జులై 22 (ప్రజాన్యూస్):ప్రజలకుజాప్యంలేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని కర్నూలు జిల్లా కలెక్టరు వీరపాండ్యన్ ఆదేశించారు

గురువారం సాయంత్రం మహానంది మండలం, తమ్మడపల్లి, బుక్కపురం, మహానంది గ్రామ సచివాలయంలను జిల్లా కలెక్టర్  జి.వీరపాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ లు తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సచివాలయ ఉద్యోగులకు సూచించారు.

మహానంది మండలంలోని గ్రామ సచివాలయంలో పరిధిలో ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు… 45 సంవత్సరాల పైబడిన వారికి ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు. ఫ్రెంట్ లైన్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు… ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారు… ఇంకా రెండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలి వంటి వివరాలను ఏఎన్ఎంను అడిగి రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా అద్వానంగా జరుగుతుందని, అందరిని మోటివేషన్ చేసి వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఏఎన్ ఎంలకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

వైయస్సార్ బీమా, కాపు నేస్తం, నేతన నేస్తం పథకాలకు సంబంధించి నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలన్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించిచారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ లను జాగ్రత్తగా మెయింటెన్ చేయాలని, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు.

నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, మహానంది తహసీల్దార్ జనార్ధన్ శెట్టి, తమ్మడపల్లి పంచాయతీ గ్రామ సర్పంచ్ చేబోలు.సాలమ్మ, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

*షోకాజ్ నోటీసు జారీ :-*

మహానంది మండలం, బుక్కపురం గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సమయంలో విధులలో అలసత్వం ప్రదర్శించిన బుక్కపురం పంచాయతీ కార్యదర్శి సుమంత్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఆశీర్వాదమ్మ లను షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *