ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి
ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి
కర్నూలు, జులై 22(ప్రజాన్యూస్) :ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలోఅధికారులు అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు.
గురువారం సాయంత్రం నంద్యాల డివిజన్ లోని మహానంది మండల కేంద్రం మహానంది – గాజులపల్లికు వెళ్లే మార్గంలో నిన్నటి రోజు నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తున్న పాలేరువాగును వర్షంలో తడుస్తూ జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు.
అటు వైపు ఇటు వైపు నీటి ఉధృతి తగ్గే వరకు రాకపోకలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని రెవెన్యూ, పోలీసు అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగాఉంటూఆయాగ్రామాల్లోపర్యవేక్షించాలన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో మరియు మహానంది పరిసర ప్రాంతాల్లో నిన్నటి రోజు నుంచి కురుస్తున్న జోరువానతో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని మహానంది తహసీల్దార్ జనార్ధన్ శెట్టి జిల్లా కలెక్టర్ కు వివరించారు.
వాగులు, వంకలు ఎవరు దాటకుండా దండోరా ద్వారా తెలపాలన్నారు. ప్రజలు, వాహనదారులు ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలను దాటకుండా, వాగుల్లో దిగకుండా తెలిపే విధంగా పోలీసులు, ఆర్ అండ్ బి అధికారులు రెడ్ కలర్ సూచిక బోర్డులు పెట్టలన్నారు. రాత్రి పూట వాగు దగ్గర పోలీసు కాపలా పెట్టి ఎవరినీ దాటనివ్వకండి చూడాలని పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నల్లమల అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉందని, ప్రాణ, పంట, ఆస్తుల నష్టం జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, మహానంది తహసీల్దార్ జనార్ధన్ శెట్టి, మండల అభివృద్ధి అధికారి సుబరాజు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.