హైకోర్టులో పలుఉద్యోగాల దరఖాస్తుకు ఆఖరుతేది ఇదే..

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది

అమరావతి జూలై 20(ప్రజాన్యూస్): ఆంద్రప్రదేశ్ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారి చేశారు. అమరావతిలోని హైకోర్టులో జడ్జీలకు, రిజిస్ట్రార్‌లకు సహాయకులుగా కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (21-07-2021) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీ పోస్టులు కలిపి మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే వారు.. ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన ఇంగ్లిష్, షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌ (నిమిషానికి 180 పదాలు) అర్హత కలిగి ఉండాలి.
* అలాగే ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాలు షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు.
* అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 37,100 జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ దరఖాస్తులను రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేషన్‌), హైకోర్టు ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు-522237 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ రేపటితో (21-07-2021) ముగియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *