నంద్యాలపట్టణంలో వక్ప్ భూములప్రకంపనలు రైతునగరంనుండి ఎస్ బిఐకాలనీ బాలాజి కాంప్లెక్స్ కి చేరిన సెగలు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది నంద్యాల

1.కర్నూలుజిల్లా నంద్యాలలో వక్ప్బోర్డు భూముల ప్రకంపనలు 2.రైతునగరం కేంద్రంగా వక్ప్ బో్ర్డుభూములతో రాజకీయం 3.అదికారంమారినప్పుడల్లా సామాన్యులతో చెలగాటం 4. 2004కుమందువరకు 100ఏళ్లు రిజష్ట్రేషన్సు  5.కోర్టుల్లో నడుస్తున్న కేసులు స్టేలు 6. అదికారంమారినప్పుడల్లా హడావుడిచేస్తున్న అదికారులు 7.భూములు మావేనంటూరైతులు మావేనంటూ వక్ప్ అదికారులు 8.అదికారం,రాజకీయంమద్య 300కుటుంబాలు బలి 9.పట్టణమంతా వ్యాపిస్తున్న రైతునగరం ప్రకంపనలు 10.ఎస్ బి ఐ కాలనీ బాలజీకాంప్లెక్సు లో లేని హడావిడి ఇక్కడ ఎందుకు అంటున్న స్థానికులు 11.కోర్టుస్టేలను దిక్కరించి అదికారులు హడావుడి చేస్తున్నారని ఆరోపిస్తున్న భాదితులు 12.అదికారపార్టీ  ప్రజాప్రతినిదులుసైతం రైతునగర్ భూముల క్రయవిక్రయాల్లో13.డెప్త్ కిపోతే ఎంతో మంది అదికారులు ప్రజలు బలయ్యే అవకాశం

                                                                                                వక్ప్ బోర్డు భూముల వ్యవహారంపై పట్టణ వ్యాప్తంగా గ్రౌండ్ రిపోర్టు 1

నంద్యాలజూలై7(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లా నంద్యాలపట్టణంలో వక్ప్ బోర్డు భూములప్రకంపనలు మారుమ్రోగుతున్నాయి..నంద్యాలపట్టణం వేగంగావిస్తరించడం త్వరలో జల్లాకేంద్రంగా ఏర్పాటుకానుండటంతో ఇక్కడ భూములకు రెక్కలువచ్చాయి..ముఖ్యంగపట్టణ శివార్లలోని రైతునగరం గ్రామపంచాయితీ వేగంగా అబివృద్దిచెందింది..ఇక్కడి భూములు కోట్లకు పలుకుతున్నాయి.,.దీంతో ఈభూములపై పలువురికళ్లుపడ్డాయి..ముఖ్యంగా ఈ ప్రాంతంలో వక్ప్ బోర్టు ల్యాండు ఎక్కువగా ఉండటంతో ఈల్యాండ్ పై పలువురి కన్ను పడింది..ఈ ప్రాంతంలోొ వందలఏళ్లనుండి అనుభవంలో ఉన్న రైతులపొలాలు అర్దాంతరంగా అడంగల్ లో వక్ప్ బోర్డు ల్యాండుగా దర్శనం ఇవ్వడంతో అటు అదికారులకు ఇటు కొంతమంది రాజకీయనాయకులకు ఈ ప్రాంతం చదరంగంగా మారింది..వీరిమద్య అమాయకులు బలైపోతున్నారు..తెలిసో తెలియకో పొలాలు కొన్నవారు ఇప్పుడు బలి అవుతున్నారు..అయితే కోట్లు పెట్టికట్టుకున్నసౌదాలను అదికారులు వక్ప్ భూములపేరుతో కూలదోస్తున్నారని ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు..వీరి ఆక్రందనలు కోర్టు వరకుచేరాయి..కోర్టులు స్టేలు ఇచ్చాయి..అయితే ఇదంతా నాణానికి ఓకవైపు అయితే ఇక్కడ నిజంగా ఏమి జరుగుతోంది..వక్ప్ బోర్టు ఎే ఏ సర్వేనెంబర్లలో ఉంది…అన్న విషయం ఇప్పడు పట్టణమంతా పాకింది..రైతునగరం తరహాలోనే పట్టణంలోని ఎస్ బి ఐ కాలనీలో 30 ఎకరాలు భూములు బయటకు వచ్చాయి.,.పట్టణంలో ని బాలాజీ కాంప్లెక్సుతో పాటుగా పట్టణంలోని మరికొన్నా ప్రాంతాలలో ఈభూములు చర్చ జరుగుతోంది..ఈభూములు వక్ప్ బోర్డు పరిదిలో లేవని సేవకు గుర్తుగా అప్పడు పొందిన యజమానులు  విక్రయించారని 100 ఏళ్లుగా రిజస్ట్రేషన్ జరిగాయని అప్పుడు అన్నిశాఖల యంత్రాంగం ఏమిచేసిందన్నది భాదితుల ప్రశ్నకాగా భూములు మావేనంటూ వక్ప్ అదికారులు చర్యలకు ఉపక్రమించారు..అయితే ఇందులో రాజకీయ ప్రయోొజనాలు ఆదిపత్యపోరుతోనే అదికారులపై వత్తిడి వస్తోందన్న విమర్శలు వస్తున్నాయి…ఈనేపద్యంలో వారంరోజులపాటు గ్రౌండ్ రిపోర్టు తయారుచేసి ప్రజలకు ప్రతినిదులకు అదికారులకు వాస్తవాలను అందించేందుకు ప్రజాటివి కంకణం కట్టుకుంది..నిజానిజాలను పారదర్శకంగా ఆదారాలతో ప్రజాటివి అందించేందుకు సిద్దమయింది..ఈలోపుగా ఎవరికీ హాని జరగకుంగా  ఎంఎల్ ఎ శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి వక్ప్ భూములపై సమగ్రనివేదికతెప్పించుకుని అటు భూములను కాపాడటంతోపాటుగా భాదితులకు తగిన న్యాయం చేస్తారని ఆశిద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *