తూర్పుగోదావరి జూలై3(ప్రజాన్యూస్):శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలో కనువిందు చేస్తున్నాయి. తాజాగా కోనసీమ ముఖద్వారంగా పిలువబడే రావులపాలెంలో శుక్రవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం కు చెందిన ధర్మరాజు నరసింహ రాజు తన ఇంట్లో ఈ అరుదైన బ్రహ్మ కమలం మొక్కను పెంచుతున్నాడు. అయితే, ఈ మొక్కకు పది రోజుల క్రితం నాలుగు మొగ్గలు వచ్చాయి. వాటిలో రెండు శుక్రవారం రాత్రి నుంచి వికసించడాన్ని గమనించిన నరసింహారావు కుటుంబ సభ్యులు బ్రహ్మ కమలం మొక్కకు పూజలు నిర్వహించారు.శనివారం స్థానిక శివాలయంలో స్వామి వారికి పుష్పాలను సమర్పిస్తామని తెలిపారు.బ్రహ్మ కమలాలవిషయం ఆనోట ఈనోట వినపడటంతో రావులపాలెంలో సందడి నెలకొంది.కొన్నేళ్ల నుంచి నరసింహ ఇంట్లోని బ్రహ్మ కమలం చెట్టుకి ప్రతీ ఏటా బ్రహ కమలాలు వికసిస్తున్నాయి.ఈ బ్రహ్మ కమలం శివునికి ప్రీతిపాత్రమైన పుష్పంగా పురాణాలు చెబుతున్నాయి. ఏడాదిలో ఒకసారి మాత్రమే.. అది కూడా రాత్రి వేళల్లో మాత్రమే పూసే ఈ పువ్వులు శ్వేత వర్ణంలో, పెద్దగా వికసిస్తాయి. రాత్రి వేళల్లో కొద్ది గంటల పాటు మాత్రమే వికసించి, అందాలొలికించి ఉదయానికి మొగ్గలా ముడుచుకుంటాయి. ఆకుల నుంచి పుష్పించే ఈ పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు