ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 30 డిశెంబరు 2025(ప్రజాన్యూస్) :

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదర్శి ప్రద్యుమ్మను నంద్యాల జిల్లా రైతునగరం రైతులు కలిశారు..167 కె జాతీయ రహదారినిర్మాణంలో కానాల బైపాస్ రోడ్డు రద్దుచేయాలని గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు పోరాడుతున్నారు..ఎన్నికలముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాలోకేష్ నాడు రైతులకు బైపాస్ రోడ్డును రద్దుచేస్తామని హమీ ఇచ్చారు..కూటమి ప్రభుత్వం అదికారంలోెకి వచ్చాక రైతులు పలు మార్లు సచివాలంలో అదికారులను ముఖ్యమంత్రిని కలిశారు..దాదాపుగా కానాల రహదారి రద్దుకు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అదికారులు హామీ ఇచ్చారు..గత ఏడాదిగా ఈ రహదారి విషయంలో ఎలాంటి ప్రకటనలు లేవు..తాజాగా నంద్యాల జెసిగా కార్తీక్ భాద్యతలు చేపట్టాక కానాలు బైపాస్ రహదారి విషయంలో ఒక అడుగు ముందుకు వెయ్యడంతో రైతులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అమరావతి వెళ్లారు..ఈనేపద్యంలో రైతులు పుచ్చకాయల శంకరరావు, వంకాయలపాటి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కార్యదర్శిని కలిశి 167 కె కానాల బైపాస్ విషయం వివరించారు..ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ,మంత్రి లోకేష్ యువగళం హామీ తోపాటుగా మంత్రులు బిసి, పరూేఖ్,రైతుల వ్యతిరేకత మేరకు ఈ రహదారికి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నట్లు గా తెలుస్తోంది..రహదారి విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని అదికారులు హామీ ఇచ్చినట్లు శంకరరావు శ్రీనివాసరావు తెలిపారు..