ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 30 డిశెంబరు 2025(ప్రజాన్యూస్) :

నంద్యాల పట్టణంలోని ఎల్ కె ఆర్ పంక్షన్ హాలులో రావుూస్ విద్యాసంస్ధల వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి..కళాశాల కరస్పాండెంట్ అప్పారావు ఆద్వర్యంలో జరగిన ఈ వేడుకలకు నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి ఎన్ ఎండి పిరోజ్, అడిషనల్ ఎస్పి యుగందర్ భాబు,నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు..వారికి కరస్పాండెంట్ అప్పారావు ఘన స్వాగతం పలికారు..అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాలలో కార్పెరేట్ స్థాయి విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్ధులను అత్యున్నత స్థానంలో నిలిపిన రావూస్ సంస్థలు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆంకాంక్షించారు..అనంతరం రావూస్ విద్యాసంస్దలలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్ధులు మెమెంటోలు అందించారు..అనంతరం అతిదులు పిరోజ్, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, అడిషనల్ ఎస్ పి యుగందర్ బాబును రావూస్ విద్యాసంస్ధల అదినేత అప్పారావు ఘనంగా సన్మానించారు..ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషున్న,డాక్టర్ రవి కృష్ణ , లక్ష్మీకాంత రెడ్డి గ,మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ,లెక్చరర్లు ,హాజరవడం జరిగింది.