ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి
నంద్యాల జూలై30(ప్రజాన్యూస్): నంద్యాల పట్టణంలోని శిల్ప మహిళా సహకర్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని 110 మంది మహిళలకు శిల్ప మహిళా బ్యాంక్ చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి సహకారంతో12లక్షల 10వెల రూపాయల చెక్కులను మహిళా బ్యాంకు డైరెక్టర్ పూర్ణిమ మహిళా బ్యాంకు మేనేజర్ హరిలచేతులమీదుగా మహిళలకు పంపిణీ చేసారు
ఈ సందర్భంగా మహిళా బ్యాంక్ మేనేజర్ హరిలీల మాట్లాడుతూ శిల్పా మహిళా బ్యాంక్ ద్వారా ఎంతోమంది మహిళలు రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వారి కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని అదేవిధంగా కరోనా సమయంలో కూడా మహిళలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే వారి అకౌంట్ లలో అమౌంట్ను జమ చేయడం జరిగిందన్నారు రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించి మరికొంతమంది మహిళలకు రుణాలను అందించే విధంగాసహకరించాలని కోరారు మహిళా సహకార్ బ్యాంకు ను మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తమ సొంత నిధులతో రుణాలను అందజేస్తూ మహిళలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మహిళా సహకార్ బ్యాంక్ ను స్థాపించడం జరిగింది అన్నారు రాజకీయాలకతీతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి మహిళకు అండగా ఉంటూ వారి అభివృద్ధి కి కృషి చేస్తున్నారని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో మహిళా బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ శిల్పా సేవాసమితి మేనేజర్ లక్ష్మీనారాయణ మహిళా బ్యాంక్ మహిళలు పాల్గొన్నారు