ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
నంద్యాలవైస్ చైర్మన్ పదవితెచ్చిన తంటా
బిసి వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
పదవికిరాజీనామకు సిద్దమయిన 25 వవార్డుకౌన్సలర్ కృష్ణమోహన్
నంద్యాలజూలై30(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లా మునిసిపల్ వైస్ చైర్మన్ పదవి బిసివర్గాల్లో కలకలం రేపింది..రాష్ట్రప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీలలో రెండవ వైస్ చైర్మన్ పదవికి అవకాశం కల్పిస్తూ ఆర్బినెన్స్ జారీచేసింది..తదనుగుణంగా ప్రతిమునిసిపాలిటీలో రెండవవైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ ముగిసింది..నంద్యాల మునిసిపాలిటీలో చైర్మన్ పదవి మైనారిటి మహిళకు అనూహ్యంగా దక్కగా వైస్ చైర్మన్ పదవి వైశ్యసామాజికవర్గానికిచెందిన గంగిశెట్టి శ్రీదర్ కుదక్కింది..రెండవ వైస్ చైర్మన్ పదవిపై బిసిలు ఆశలు పెట్టుకున్నారు..బిసి సామాజకివర్గంలో మాజీమంత్రి శిల్పా వర్గానికి విశ్వాసపాత్రులుగా పలువురు ఉన్నారు..ఇందులో పున్నాశేషయ్య,తెలుగు కృష్ణమోహన్ కుటుంబాలు ముఖ్యులు మూడుసార్లు పున్నాకుటుంబం కౌన్సిలర్ గా ఎంపికకాగా కృష్ణమోహన్ కుటుంబం 5సార్లు కౌన్సిలర్లుగా ఎంపికయ్యారు..గత ఎన్నికలలో సైతం వీరు శిాల్పాగ్రూపునుండి కౌన్సిలర్లుగా ఎంపికయ్యారు..అయితే రెండవ వైస్ చైర్మన్ బిసి సామాజికవర్గానికి చెందిన వీరికిగాని కాపు సామాజిక వర్గానికి గాని దక్కుతుందని పలువురు భావించారు..లేదా రెడ్డి సామాజిక వర్గానికిచెందిన ఎంఎల్ ఎ సతీమణిా నాగినిరెడ్డి,మాజీ చైర్మన్ దేశంసులోచన,మలికిరెడ్డి లలితమ్మకు గాని ఇస్తారన్న ఊహాగాానాలు సైతం వినపడ్డాయి..అయితే అనూహ్యంగా గురువారం రాత్రి యస్ సి సామాజికవర్గానికి చెందిన పాంషావలి పేరు ప్రతిపాదనకు రావడం అదిష్టానంనుంచి ఆమొదం రావడం చకచకా జరిగిపోయాయి..దీంతో పాంషావలి ఎన్నిక ఏకగ్రీవం అయింది..దీంతోొ 5సార్లు కౌన్సిలర్ గా ఎన్నికయిన 25 వ వార్డు కౌన్సిలర్ భగ్గుమన్నారు..గతంలో ఓడిపోయిన వారికి పదవుల పందారంచేసారని తమకుటుంబానికే కాక బిసి సామాజికవర్గానికి అన్యాయంచేశారని వాపోయారు..ఇంత అవమానంజరిగాక తాను పార్టిలో గానిపదవిలో గాని కొనసాగడం లేదని రాజీనామా చేస్తానని ప్రకటించారు..శనివారం తన అనుచరులతో మునిసిపల్ చైర్మన్ ను కమీషనర్ నిా కలిాసి తనరాజీనామ పత్రాన్ని అందిస్తున్నట్లు కృష్ణ మోహన్ ప్రకటించారు.బిసిలకు పదవిదక్కకపోవడంతో బిసి సంఘాలు కూడా భగ్గుమన్నాయి..కాగా 25 వార్డు కౌన్సిలర్ రాజీనామకు సిద్దం కావడంతోొ కృష్ణమొహన్ నుబుజ్జగించేపనిలో వైసిపి సీనియర్ నేతలు ఉన్నారు..