పసుపు పార్టీకి పసల రాము యాదవ్ సేవలు భేష్..నామినేటెడ్ పోస్టులో ముందంజ

అమరావతి మే 30(ప్రజాన్యూస్)

✤ NTR పార్టీ పెట్టినప్పుడు తండ్రి..నేటివరకు కుమారుడు పార్టీ సేవలోనే
✤ ప్రతిపక్షంలో ఉన్నా అదికారంలో ఉన్నా పార్టీకోసం త్యాగాలు
✤ ఆళ్లగడ్డలో ప్రస్తానం..నంద్యాలజిల్లాలో గుర్తింపు
✤ ఆళ్లగడ్డ నంద్యాల బులియన్ మర్చంట్ అసోసియేషన్ లో కీలకం
✤ యాదవసంఘం నేతగా జిల్లాలో పేరు ప్రఖ్యాతులు
✤ పార్టీకోసం కోట్లరూపాయల వెచ్చింపు
✤ లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ద్వారా విశిష్ట సేవలు
✤ ఆళ్లగడ్డ టిడిపి కార్యదర్శిగా ఎంపిటిసి గా ప్రజాసేవ
✤ నంద్యాలపార్లమెంటు టిడిపి స్పోక్స్ పర్సన్ గా ప్రత్యర్ధులకు దీటుగా మాటల తూటాలు
✤ బిసిల,యాదవుల ముద్దుబిడ్డగా పేరు ప్రఖ్యాతులు
✤ పసుపుపార్టీ విదేయుడికి తగిన పగ్గాలకోసం బిసి ల డిమాండ్

తెలుగుదేశం పార్టీపుట్టినప్పటినుండి బిసిలపార్టీగా గుర్తింపు పొందింది..అన్న ఎన్టి ఆర్ పార్టీ స్థాపించినప్పుడే బిసిలకు సాదికారత కల్పించి రాజకీయాలలో బిసిలకు సముచిత స్థానం కల్పించారు..చంద్రబాబు పార్టీ పగ్గాలు పట్టినతరువాత బిసిలను సామాజికంగా ఉన్నత స్థానంలో ఉంచారు..పార్టీలో పలు పదవులు ఇచ్చి వారికి తగినగౌరవం కల్పించారు..నేటికి బిసిలకు తెలుగుదేశంపార్టీ అంటే అందుకే అంత ఇష్టం..ఈ నేపద్యంలోనే అన్న నందమూరి పార్టీ స్థాపించినప్పటినుండి నేటి వరకు కొంతమంది బిసిలు తమ యావత్తు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో సేవలందిస్తూ తరిస్తున్నారు..

ఈకోవలోనే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన పసల రామయ్య .. నందమూరి పార్టీస్థాపించినప్పుడు టిడిపి అభిమానిగా మారారు..పట్టణంలోని గోకుల కృష్ణ దేవాలయం పౌండర్ గా యాదవసంఘం గౌరవ అద్యక్షులుగా ఆయన సామాజిక, ఆద్యాత్మిక సేవలు అందిస్తూ తెలుగుదేశంపార్టీ అప్పటి నేత భూమా శేఖరరెడ్డికి అనుంగు అనుచరుడిగా తెలుగుదేశంపార్టీ గెలుపుకువిశేష కృషిచేశారు..

వీరి కుమారుడు పసల రాము యాదవ్. 1977 లో జన్మించిన రాము యాదవ్ యుక్తవయస్సు వచ్చే సరికి తండ్రి బాటలోనే తెలుగుదేశం అబిమానిగా మారారు..ఆళ్లగడ్డ పట్టణంలో బంగారు వ్యాపారం కొనసాగిస్తూ తండ్రి బాటలోనే తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా మారారు..2005 నుండి 2008 వరకు ఆళ్లగడ్డ పట్టణ టిడిపి కార్యదర్శిగా పనిచేశారు..2006 లో జరిగిన ఎంపిటిసి ఎన్నికలలో తన బార్య బారతి యాదవ్ ను (అప్పటి కెడిసిసి బ్యాంక్ చైర్మన్ తిరుపాల్ యాదవ్ కుమార్తె) పోటీచేయించి 900 ఓట్లతో ప్రత్యర్ధిపై గెలుపుసాదించారు..అప్పటి కాంగ్రెస పార్టీ గాలిలో సైతం ప్రత్యర్ధులతో పోటీ పడి టిడిపి తరుపున తన భార్యను గెలిపించుకుని బిసిల బలమేంటో తెలుగుదేశం సత్తా ఎంటో నిరూపించారు పసల కుటుంబీకులు..మరో ఆరునెలలకు సర్పంచు ఎన్నికలు వస్తే తమ కుటుంబానికి సర్పంచు అవకాశం ఇవ్వకపోయినా పార్టీ నేతలు సూచించిన వారిగెలుపుకు కృషిచేశారు పసల రాము యాదవ్..అప్పటినుండి పదవులకోంచూడకుండా 2014 నుండి 2019 కాలపరిదిలోని సర్పంచు అభ్యర్ధులకు కూడా బిసి సంఘాలనుండి మద్దతు కూడ కట్టి వారి గెలుపుకు పసల కుటుంబం విశేష కృషిచేసింది..2019లో వైసిపి అదికారంలోకి వచ్చాక కూడా 2020 లో మునిసిపల్ ఎన్నికలలో 7 మంది అబ్యర్ధులగెలుపు కోసం ఆర్ధికంగా వెచ్చించి వైసిపి గాలిలో కూడా ఇద్దరు కౌన్సిలర్లను గెలిపించిన ఘనత పసలరాము యాదవ్ కే దక్కుతుంది.

.2022లో నంద్యాలపార్లమెంటు టిడిపి అదికార ప్రతినిదిగా ఎన్నికయిన పసల రాము యాదవ్ తన దైన శైలిలో ప్రతిపక్షాల విమర్శలకు సోషయల్ మీడియా ద్వారా కౌంటర్లు ఇస్లూ పలు కేసులను కూడా ఎదుర్కున్నారు..లైన్సు క్లబ్ రోటరీ క్లబ్ ద్వారా పేదలకు పలు సేవాకార్యక్రమాలు అందిస్తూ మరో వైపు వ్యాపారం ద్వారా పలుగ్రామాల ప్రజలతో సత్సంబందాలు నెలకొలుపుతూ నంద్యాల జిల్లాలో యాదవసంఘాలతో మమేకమై, యాదవుల కష్టనష్టాలలో పాలుపంచుకుంటూ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు పసల రాము యాదవ్..నంద్యాల,ఆల్లగడ్డ బులియన్ మర్చంట్ అసోసియేషన్ ద్వారా వారి సమస్యల సాదనకు కూడా పసల యాదవ్ కృషిచేశారు..దాదాపు నాలుగా దశాబ్దాలుగా పార్టీకోసం వీరికుటుంబం అంకితమైంది..రెండు దశాబ్దాలపాటు పసల యాదవ్ పార్టీ అదిష్టానం స్థానిక నేతల మాట తుచ తప్పకుండా పార్టీకోసం సేవలు అందించడంతో పాటుగా ఆర్ధికంగా కోట్లలో నష్టపోయారు..

అయినప్పటికి 2024 ఎన్నికలలో నంద్యాలజిల్లా వ్యాప్తంగా తనకున్న పరిచాయలతో బిసిలలో ఉన్న పట్టుతో 7 నియోజకవర్గాలలో తిరిగి 2లక్షల మంది యాదవులకు తెలుగుదేశం పార్టీ అదికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు..యువగళం పాదయాత్రలో యువనేత వెంబడి పాల్గొన్నారు..కొన్నికేసులను కూడా ఎదుర్కున్నారు..టిడిపి నేతగా ఉన్నందుకు పసల వ్యాపారాలను కూడా ప్రత్యర్దులు దెబ్బతీశారు..అయినప్పటికి పార్టీ అదికారంలోకి వచ్చేంతవరకు పట్టువదలని విక్రమార్కుడిలా సేవలందించారు..పార్టీ అదికారంలోకి వచ్చాక అమరావతి లో పార్టీ అద్యక్షుడు పల్లా శ్రీనివాసరావు,బీదరవిచంద్ర,యువనేత లోకేష్, చంద్రబాబులను సైతం పసలరాముడు పలు సందర్బాలలో కలిసి పార్టీకి తాను అందించిన సేవలను వివరించారు..రెండురోజుల క్రితం జరిగిన మహానాడులో సైతం పసల తనదైన శైలిలో ఖర్చుచేసి మహానాడుకు తరలివెళ్లారు..నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందించిన పసల రికార్డు పార్టీలో కీలకమే..చివరకు ఈయన పసుపురంగు పార్టీతో ఎంత మమేకం అయ్యారంటే నంద్యాలలో ఈయన స్వగృహంకూడా పసుపుమయమే..

పార్టీ అదిష్టానంలో సైతం పసలకు సరైన గుర్తింపు ఇవ్వాలనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం..త్వరలోనే పసలరాముకు బిసి కోటాలో నంద్యాల జిల్లా అద్యక్ష పదవిగాని మరో కీలక పదవిగాని లభించే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది..ఈ చర్చకు మద్దుతుగా బిసి మరియు యాదవసంఘనేతలు కూడా పసల సేవలు గుర్తించి జిల్లాలో లేదా రాష్ట్ర కమిటీలలో మంచి పదవి ఇచ్చి అదిష్టానం గౌరవించాలని కోరుతున్నారు..ఆల్ ది బెస్ట్ టు పసల రాము యాదవ్ అంటూ విషెష్ చెబుతున్నారు..రాము యాదవ్  నూతన పదవిని అలంకరించి ప్రజలకు పార్టీకి మరిన్ని  సేవలు అందించాలని పలువురు కోరుకుంటున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *