ఈవియం ల స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు

♦ప్రజాటివి డిజిటల్ ప్రతినిది ప్రబాకర్ చౌదరి

⇔విజిటర్స్ రిజిస్టర్ లో సంతకం చేసిన జిల్లా ఎన్నికల అధికారి

భారత ఎన్నికల సంఘం సూచించిన ఆదేశాల మేరకు ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ ను తనిఖీ చేసి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం టేక్కె మార్కెట్ యార్డు గోడౌన్లో భద్రపరచిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా శ్రీనివాసులు మాట్లాడుతూ ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ వద్ద 24/7 నిరంతర పటిష్ట నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆరు నియోజక వర్గాలకు చెందిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఈ వి ఎమ్ అనుబంధ యూనిట్స్ విషయంలో తీసుకున్న భద్రతా పరమైన అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తదుపరి అక్కడ ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ సందర్శన రిజిస్టర్ లో కలెక్టర్ సంతకం చేస్తూ నిఘా నిరంతరాయంగా ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

వైయస్సార్ సిపి పార్టీ తరఫున అనిల్ అమృతరాజు, సిపిఎం ప్రతినిధి పూల నరసింహులు, సిపిఐ తరఫున రంగనాయుడు, కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ రియాజ్ బాషా, తెలుగుదేశం పార్టీ తరఫున శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *