హోటల్స్ సమస్యలపై అసోసియేషన్ సమావేశానికి విశేష స్పందన

ప్రభాకర్ చౌదరి ప్రజాటివి ప్రతినిది

రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నంద్యాల పట్టణంలో శుక్రవారం ప్రముఖ ఎల్ కె ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగింది..ఈసమావేశానికి 25 జిల్లాల్లోని ప్రధాన హోటల్స్ నిర్వాహకులు హాజరుకాగా  రాష్ట్ర అసోసియేషన్ లో కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనిది హోటల్ అధినేత రఘువీర్ ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించారు..సమావేశానికి రాష్ట్ర నాయ్యశాఖామంత్రి ఎన్ ఎండి పరూఖ్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు.. సమావేశాన్ని రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో నిర్వహించడానికి అసోసియేషన్ సభ్యులు భావించినప్పటికి, నంద్యాల జిల్లా కేంద్రంలో ఈసారి సమావేశం జరిగి తీరాల్సిందే నని రఘువీర్ పట్టుబట్టి సమావేశాన్ని విజయవంతంచేశారు.. 200 మందికి పైగా పేరు మోసిన హోటల్స్ అధినేతలు ఈ సమావేశంలో పాల్గొని హోటల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పరూఖ్ కు వివరించారు..  సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని మంత్రి అసోసియేషన్ సభ్యులకు హామీ ఇచ్చారు.. ఈసందర్బంగా మాట్లాడుతూ గౌరవాధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి,గౌరవ కార్యదర్శి నాగరాజు, కోశాధికారి పూర్ణచందు తదితరులు  మాట్లాడుతూ.స్విగ్గి జొమోటో లాంటి సంస్థలతో హోటల్స్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని, టాక్స్ లు ఇతర వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు, ప్రతి సభ్యుడు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వ దృష్టికి కూడా తెస్తామని రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రఘువీర్ హామీ ఇచ్చారు.  అనంతరం సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన హోటల్ అదినేతలకు రాష్ట్ర నేత రఘువీర్  కృతజ్ఞతలు తెలియజేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *