వైయస్ ఆర్ కడప,మే 29( ప్రజాన్యూస్)
మహానాడు మూడవరోజున ఆళ్లగడ్డ నియోజకవర్గంనుండి ఎంఎల్ఎ భూమా అఖిలప్రియ ఆద్వర్యంలో వేలాది మంది నేతలు కార్యకర్తలు కడప మహానాడుకు తరలివెళ్లారు..అఖిలప్రియ పిలుపుమేరకు మహిళానేతలు సైతం మేము సైతం అంటూ కడప మహానాడుకు తరలివెళ్లారు..ఆళ్లగడ్డలో టిడిపి మహిళానేతగా ఎంఎల్ ఎ వెంట పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మహిళా నేత కత్తి శ్రావణి సైతం మహానాడు కార్యక్రమానికి తరలి వెళ్లారు..ఈ సందర్బంగా మహిళానేత కత్తి శ్రావణి మాట్లాడుతూ ఎంఎల్ఎ భూమా అఖిలప్రియ ఆద్వర్యంలో మహానాడులో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ ఆర్ బి సి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ అనంత రామ సుబ్బారెడ్డి ,మున్సిపల్ కౌన్సిలర్ షేక్. హుస్సేన్ బాషా . . శేఖర్ రెడ్డి. మరియు మల్లీశ్వర్ రెడ్డి, నాగంజి, బొమ్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు