♦ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
⇔ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలంటే బిజెపి కె సాధ్యం.
⇔ఆశీర్వదించండి గుజరాత్,యూపి లా అభివృద్ధి చేసి చూపిస్తాం.
రాష్ట్రంలో మరోసారి వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులకు వారసుడు జగన్ మోహన్ రెడ్డి అవుతారని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు పేర్కొన్నారు. బిజెపి పార్టీ ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజుల ప్రజా పోరు యాత్రకు శ్రీకారం చుట్టారు.నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో చేపట్టిన ప్రజా పోరు యాత్ర నేటితో ముగిసింది.తొమ్మిది రోజులు ఉదయం,సాయంత్రం బిజెపి చేపట్టిన,చేసిన పథకాలు,అభివృద్ధి ప్రజలకు తెలియజేశారు.నంద్యాల మండలంలోని కానాల, రైతునగర్ ,నూనె పల్లి,ప్రభుత్వ ఆసుపత్రి,సాయిబాబా నగర్ ప్రాంతాల్లో ప్రజా పోరు యాత్ర నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మరో సారి అధికారంలోకి వస్తె మీ ఆస్తులకు జగన్ మోహన్ రెడ్డి వారసులు అవుతారని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలంటే బిజెపి ప్రభుత్వానికే సాధ్యమవుతుందని అన్నారు.రాష్ట్రంలో బిజెపినిఆశీర్వదిస్తే బీహార్,ఉత్తర ప్రదేశ్ లా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. బిజెపి ప్రభుత్వ హయాంలో యూరియా,డి ఎ పి ధరలు రైతులకు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. వరి కి మద్దతు ధర కల్పించారన్నారు.రైతులకు క్రెడిట్ కార్డు,అత్యాధునిక పరికరాలు డ్రోన్లు ఏర్పాటుచేశారు అన్నారు.బనగాన పల్లెలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుచేసిన ఘనత బిజెపి కె దక్కుతుందని అన్నారు.విత్తనాలు,ఎరువులు,మందులు నకిలిలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.
సండే ఎమ్మెల్యే మా కొద్దని ఒక ఓటరు లెటర్ ద్వారా వైసిపి అబిమానే చెప్పాడని గుర్తుచేశారు.విశ్వకర్మ యోజన పథకం చేతి వృత్తులు వారికోసం బిజెపి ప్రభుత్వం క్యాలెండర్ లు ముద్రిస్తే నంద్యాల లోని వైసిపి వార్డ్ ఇంచార్జీ లు రాష్ట్ర ప్రభుత్వ పదకాలు అంటూ బిజెపి క్యాలెండరు చూపిస్తున్నారని అన్నారు.ఒకసారి బిజెపి కి అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి రెడ్డి,మేడా మురళీధర్,రమణా రెడ్డి,మోహన్ రెడ్డి,గురు బ్రహ్మ,రామకృష్ణా రెడ్డి,స్వాతి,అరుణ, వాణి,మాధురి తదితరులు పాల్గొన్నారు.