ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల,మార్చి,28(ప్రజాన్యూస్)
నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా నంద్యాల మండలం రైతునగర్ గ్రామ టిడిపి నేత రాష్ట్ర తెలుగురైతు ఉపాద్యక్షుడు గుంటుపల్లి హరిబాబును నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది..తనను ఎంపికచేసిన కూటమి ప్రభుత్వానికి గుంటుపల్లి హరిబాబు ఈసందర్బంగా కృతగ్నతలు తెలిపారు..
35 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా నంద్యాల మండలం రైతునగరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కీ శే గుంటుపల్లి వెంకటేశ్వర్లు కుమారుడు రాష్ట్ర తెలుగురైతు సంఘ ఉపాద్యక్షుడు గుంటుపల్లి హరిబాబును నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులుజారీచేసింది….గత దశాబ్దాలకాలంగా గుంటుపల్లి కుటుంబం టిడిపిలో ఉంటూ పార్టీకి తమదైన శైలిలో విదేయతగా ఉంటోంది..గత ప్రభుత్వంలో టిడిపి నేత గుంటుపల్లి హరిబాబు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా మొక్కవోని దైర్యంతో గత ఎన్నికలలో టిడిపి అభ్యర్ధి ఎన్ ఎండి పరూఖ్ కు గెలుపుకు కృషిచేశారు..యువనేత నారాలోకేష్ పాదయాత్రలో చురుకుగా పాల్గొని యువనేత మన్ననలు పొందారు..ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఎన్నికల పరిశీలకులుగా కూడా పనిచేశారు..టిడిపి అదిష్టానం ఎవరికి బాద్యతలు అప్పగిస్తే ఆనాయకుడికి విదేయతగా ఉంటూ కష్టపడి పనిచేసి టిడిపి అదిష్టానం మెప్పుపొందారు..తెలుగుదేశం పార్టీ తెలుగురైతు సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ,ప్రస్తుతం తెలుగురైతు సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడిగా తనకు ఇచ్చిన భాద్యతలను చిత్తశుద్దితో నిర్వహిస్తూ పార్టీ మన్ననలు పొందారు..అందరిని కలుపుకునిపోయే తత్త్వం ఉన్న వ్యక్గిగా గుంటుపల్లి హరిబాబు పేరుతెచ్చుకున్నారు..నంద్యాల మార్కెట్ యార్డు పదవికి అత్యదిక పోటీ నెలకొని ఉన్పప్పటికి స్థానికంగాను ,అదిష్టానం వద్ద విదేయతగల వ్యక్తిగా గుంటుపల్లికి పేరు ఉండటంతో చివరిక్షణంలో గుంటుపల్లి హరిబాబుకు పదవి దక్కింది..ప్రభుత్వం నిర్వహించిన ఐవి ఆర్ ఆస్ సర్వేలో సైతం గుంటుపల్లికి అత్యదిక స్కోరు రావడంతో ఎట్టకేలకు గుంటుపల్లి హరిబాబును చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది..గుంటుపల్లికి పదవి దక్కడంతో గుంటుపల్లి అభిమానులు,టిడిపి అభిమానులు, బందు మిత్ర శ్రేయోభిలాషులు గుంటుపల్లికి అభినందనలు తెలిపారు..నంద్యాల మార్కెట్ యార్డు 17 వచైర్మన్ గా పదవీ బాద్యతలు స్వీకరించనున్న గుంటుపల్లి హరిబాబు కమ్మ సామాజికి వర్గానికి చెందిన వాడు కాగ సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే సమాజికవర్గానికి పదవి దక్కడంతో కమ్మ సామాజిక వర్గం హర్షం వ్యక్తంచేసింది..20 ఏళ్ల క్రితం వెంకటనారాయణ చౌదరి ఇదే సామాజిక వర్గంనుండి మార్కెట్ యార్డు చైర్మన్ గా పనిచేశారు..20 ఏళ్ల తరువాత తమ సామాజికవర్గానికి పదవి ఇచ్చిన మంత్రి పరూఖ్ కి, మంత్రి నారాలోకేష్, కూటమి ప్రభుత్వానికి కమ్మ సంఘనేతలు కృతగ్నతలు తెలిపారు..ఈసందర్బంగా గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ తనకు ఈపదవిదక్కేందుకు సహకరించిన మంత్రి ఎన్ ఎండి పరూఖ్,మంత్రి నారాలోకేష్ తోపాటు కూటమి ప్రభుత్వానికి విదేయతగా ఉంటూ వారిసహకారంతో మార్కెట్ యార్డు ద్వారా రైతులకు అండగా ఉంటానన్నారు..