నంద్యాలలో దూదేకుల జిల్లా స్థాయి సమావేశం విజయవంతం..

ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి

ఆళ్లగడ్డ,27మే 2025(ప్రజాన్యూస్)

నంద్యాల పట్టణంలోని  వాసవి స్కూల్ నందు జరిగిన నూర్ భాషా దూదేకుల నంద్యాల జిల్లా సమావేశం విజయవంతంగా ముగిసినది.ఈ కార్యక్రమము జిల్లా అధ్యక్షులు శ్రీ వాసవి దస్తగిరి ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవఅధ్యక్షులు డాక్టర్ బాబన్  , రాష్ట్ర కమిటీ ట్రెజరర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ దస్తగిరి ముఖ్య అతిథులుగాహాజరయ్యారు . ఈ సమావేశానికి నంద్యాల జిల్లా అన్ని మండలాల కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబన్ మాట్లాడుతూ జిల్లాలో దూదేకుల సంఘం బలోపేతం కావాలంటే అన్ని మండలాలకు కమిటీలు ఏర్పడి పటిష్టం కావాలని తెలిపారు. అలాగే వాసవి దస్తగిరి మాట్లాడుతూ దూదేకుల కులస్తులలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ నందు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పారితోషకము అందించి వారిని ప్రోత్సహించాలని, అలాగే ఇంతవరకు ఏర్పడిన కమిటీలను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు..డాక్టర్ పర్ల దస్తగిరి మాట్లాడుతూ మన సంఘం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి విమర్శలకు లోను కాకుండా విమర్శించిన అవి పట్టించుకోకుండా సంఘం పనిచేయాలని అప్పుడే అభివృద్ధి దిశలో వెళ్తుంది అని తెలిపారు..


ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయురాలు వసుమతి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని సభాముఖంగా తెలిపారు.. పట్టణ కమిటీ అధ్యక్షులు షేక్షావలి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన వంతుగా 15 మందికి తగిన బహుమతిగా పారితోషకం అందిస్తానని తెలిపారు.. మరియు వెస్టండ్ర్ టైలర్  దస్తగిరి మాట్లాడుతూ తాను కూడా పిల్లల అభ్యున్నతి కోరుతూ మన సంఘంలో ఉత్తమ ఫలితాలు సాధించిన పదిమంది పిల్లలకు పారితోషకం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సెక్రటరీ దస్తగిరి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కమిటీలను బలోపేతం చేస్తామని తెలిపారు..అలాగే ట్రెజరర్ హుస్సేన్ అప్ప మరియు పట్టణ కమిటీ సెక్రటరీ ఆదాము మరియు ట్రెజరర్ సోమశేఖర్ యూత్ కమిటీ అధ్యక్షులు గబ్బర్ దస్తగిరి ఖాసీం వలి మరియు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు పాల్గొని సభను విజయవంతం చేశారు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *