ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ లో చలివేంద్రంను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహారెడ్డి

రిపోర్టర్ :దూదేకుల ఖాసీం వలి

ఆళ్లగడ్డ,మార్చి,27 (ప్రజాన్యూస్)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని గురువారం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.నరసింహారెడ్డి ప్రారంభించారు. ప్రముఖ ఆర్తో వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మిరెడ్డి, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక, డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డిల సౌజన్యంతో వేసవికాలం దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ పూర్వం వేసవికాలంలో బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసే వారని.. ప్రస్తుతం బాటలు లేవు బాటసారులు అన్న మాట లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్ లో నిత్యం ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం బస్టాండ్ లో చలివేంద్రం ని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. ఇందుకు సహాయ సహకారాలు అందజేసిన ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, యాజమాన్యానికి, కార్మిక సోదరులకు డాక్టర్ నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్లో చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు, ఆఫ్తాల్మిక్ నిపుణుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *