ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి![]()
నంద్యాల,27 పిబ్రవరి 2026(ప్రజాన్యూస్)
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్యమి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక మహోద్యమం లా ముందుకు తీసుకుని వెళ్లాలని ఆ పార్టీ నంద్యాల పార్లమెంటు పరిశీలకులు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన నాయకులకు పిలుపునిచ్చారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల భాస్కర్ రెడ్డి కళ్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుండి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని..
కేవలం నిన్న ఒక్కరోజే లక్ష నూతన సభ్యత్వాలు నమోదు అయ్యాయని అన్నారు.
అలాగే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. తాను ఇన్చార్జిగా ఉన్న నంద్యాల పార్లమెంటు పరిధిలో స్థానిక నాయకులు, జనసైనికులు అందరి సహకారంతో నంద్యాల ను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని పార్టీ పరిశీలకులు కిలారి రోశయ్య పేర్కొన్నారు.
ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాల మేరకే పనిచేయాలని సూచించారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ హై కమాండ్ , జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. సోదరి మైలేరి సురేఖకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ప్రకటించి జీవ విడుదల ఎనిమిది నెలలు గడుస్తున్న స్థానిక MLA డైరెక్టర్ స్థానాల జాబితా ఇప్పటివరకు ఇవ్వకపోవడం పట్ల కిలారి రోశయ్య విస్మయం వ్యక్తం చేశారు. పార్టీ నీ నమ్ముకున్న ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగదని ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారానే త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ
జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మాట్లాడుతూ.. 2014 నుండి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగిందని తెలిపారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ ఆశయ సాధనకు కట్టుబడి జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఉద్యమి పార్టీ సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.