♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
⇔నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయాన్ని తనిఖీ చేసిన కర్నూలు రేంజ్ DIG . విజయ రావు
⇔రాబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ కృషి చెయ్యాలని ఆధేశం
⇔జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం
కర్నూలు రేంజ్ డిఐజి CH . విజయ రావు నంద్యాలజిల్లా పోలీసు కార్యాలయాన్ని తనిఖీచేశారు.. జిల్లా ఎస్పీ K రఘువీర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. జిల్లాలోని పోలీసు అదికారులను ఎస్పి DIG పరిచయం చేశారు.అనంతరం AR సిబ్బంది నుండి DIG గౌరవవందనం స్వీకరించారు.అనంతరం ఎస్ పి రఘువీర్ రెడ్డి తో కలిసి కొత్తగా నిర్మిస్తున్న పోలీసు భవన సముదాయాన్ని,AR కార్యాలయాన్ని డిఐజి పరిశీలించారు. డిపిఓ లోని అన్ని విభాగాల పనితీరును,DCRB,స్పెషల్ బ్రాంచ్ మరియు AR విభాగాల గురించి డిఐజి సమీక్షించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక YSR సెంటినరీ హాల్లో నంద్యాల జిల్లాలోని అన్నీ సబ్ డివిజన్ ల డిఎస్పీలు, సిఐల తో కర్నూలు రేంజ్ డిఐజి జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు.
ఈసందర్బంగా డిఐజి మాట్లాడుతూ అందరూ టీమ్ వర్క్ గా పని చేసి ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుత వాతవరణంలో జరిగే విధంగా చూడాలని, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లపై ప్రత్యక నిఘా ఉంచాలని ,ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించాలని.ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలనిమద్యం, డబ్బు, బార్డర్ చెక్ పోస్టుల వద్ద అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ తనిఖీలు చేపట్టాలన్నారు.నాన్ బెయిలబుల్ వారెంట్స్, మర్డర్ కేసుల ముద్దాయిల అరెస్టు పెండింగ్ ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయుధాల లైసెన్సుల డిపాజిట్లు, రౌడీ షీటర్స్ , ట్రబుల్ మాంగర్స్ , సమస్యాత్మక గ్రామాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలలో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. గతంలో జిల్లాలో జరిగిన ముఖ్యమైన, సంచలనాత్మకమైన నేరాల గురించి సమీక్ష చేశారు. ఎక్కువగా శాంతిభద్రతల సమస్యలు ఏర్పడిన విధానం, ప్రదేశం, కారణాల గురించి ఆరా తీసి.. అవి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
నంద్యాల జిల్లా ఎస్పీ K.రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ…నేరాలను, రోడ్డు ప్రమాదలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకొని రోడ్డు ప్రమాదాలను బాగా తగ్గించామన్నారు. కర్నూలు రేంజ్ డిఐజి ఆదేశాల తో ఎన్నికలను ప్రశాంత వాతవారణంలో జరిగే విధంగా గట్టి చర్యలు తీసుకుంటామని, , సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లపై ప్రత్యక నిఘా ఉంచుతామని,ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలోని పోలీసు అదికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు.